కరోనాను జయించిన పిల్లలకు మరో ముప్పు - mis -c cases rising in ap
close
Published : 14/06/2021 20:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనాను జయించిన పిల్లలకు మరో ముప్పు

అమరావతి: ఏపీలో కరోనా నుంచి కోలుకున్న కొంతమంది చిన్నారులు మల్టీసిస్టం ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌ (మిస్క్‌-సీ)  బారిన పడినట్టు వైద్యులు గుర్తించారు. కరోనా మూడో దశలో ఈ కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కరోనా రెండో దశలో 15 శాతం చిన్నారులు వైరస్‌ బారిన పడటం వల్ల మిస్క్‌ కేసులు ఎక్కువయ్యాయని వెల్లడించారు.  పురిటిలో ఉన్న శిశువులకు మిస్క్‌ సోకుతుందని, కొవిడ్‌ చికిత్స తర్వాత మూడురోజులు జ్వరం ఉంటే అది మిస్క్‌గా అనుమానించాలని వైద్యులు చెబుతున్నారు. జ్వరం, వాంతులు, డయేరియా, కడుపులో నొప్పి, చర్మం మీద మచ్చలు, కండ్లకలగ, గొంతులో ఇన్‌ఫెక్షన్‌, ఇతర శరీర అవవాలు సరిగా పనిచేయకపోవడం వంటి లక్షణాలు పిల్లల్లో కనిపించిన వెంటనే నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నారు. ఈ వ్యాధిని ముందుగానే గుర్తించి సరైన చికిత్స అందిస్తే పిల్లల ప్రాణాలు కాపాడవచ్చు అంటున్నారు వైద్యులు. కరోనా మూడోదశలో మిస్క్‌ కేసులు ఎక్కువయ్యే ప్రమాదం ఉన్నందువల్ల చికిత్సకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని చెబుతున్నారు.  వైద్యుల సూచనల మేరకు ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్‌ కమిటీని నియమించింది. రాష్ట్రవ్యాప్తంగా అనేక ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేస్తోంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని