నితిన్‌కు అభయమిచ్చిన హైదరాబాద్‌ పోలీస్‌ - missing kanabadutaledhu post by nithin
close
Published : 21/03/2021 01:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నితిన్‌కు అభయమిచ్చిన హైదరాబాద్‌ పోలీస్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: నితిన్‌కు హైదరాబాద్‌ పోలీసులు అభయం ఇవ్వడం ఏమిటీ..? ఇంతకీ నితిన్‌కు ఏమైంది అనుకుంటున్నారా..? కంగారు పడకండి. నితిన్‌కు ఏమీ కాలేదు. ప్రస్తుతం నితిన్‌, కీర్తి సురేశ్‌ జంటగా ‘రంగ్‌ దే!’ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మార్చి 26న విడుదల కానుంది. ఈ సందర్భంగా నితిన్‌ ఒక ట్వీట్‌ చేశారు. ‘కనబడుట లేదు.. డియర్‌ అను.. నువ్వు ఎక్కడున్నా రంగ్‌దే ప్రమోషన్స్‌లో పాల్గొనాలని మా కోరిక. ఇట్లు నీ అర్జున్‌’ అంటూ ఆ ట్వీట్‌లో కీర్తి సురేశ్‌ చిన్ననాటి ఫొటోను పంచుకున్నారు. కాగా.. ఆ ట్వీట్‌కు హైదరాబాద్‌ సిటీ పోలీస్‌లు స్పందించారు. ‘చింతించకండి నితిన్‌. మేము జాగ్రత్త తీసుకుంటాం’ అంటూ బదులిచ్చారు. దీనిపై నవ్వుతున్న ఎమోజీలతో మళ్లీ నితిన్‌ స్పందించారు. పోలీసుల చమత్కారానికి నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని