లఖ్‌నవూలో ప్రారంభమైన ‘మిషన్ మజ్ను’.. - mission majnu shooting started in lucknow‌
close
Published : 06/02/2021 14:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

లఖ్‌నవూలో ప్రారంభమైన ‘మిషన్ మజ్ను’..

ముంబయి‌: బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్ర హీరోగా స్పై థ్రిల్లర్‌ నేపథ్యంలో వస్తున్న చిత్రం ‘మిషన్‌‌ మజ్ను’. శంతన్‌ బాగ్చి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దక్షిణాది అందాల కథానాయిక రష్మిక మందన తొలిసారిగా బాలీవుడ్ తెరపై కనిపించనుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్‌ లఖ్‌నవూలో ప్రారంభమైంది. సినిమా 1970ల నాటి వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది. ఇందులో సిద్ధార్థ్ మల్హోత్ర రా ఏజెంట్‌గా మిషన్‌కు నాయకత్వం వహించే పాత్రలో నటిస్తున్నారు. ఆర్‌ఎస్‌వీపీ మూవీస్‌ పతాకంపై రోనీ స్కూవాలా నిర్మిస్తున్నారు. చిత్రానికి అమర్ బుటాలా, గరిమా మెహతాలు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

ఆ మధ్య ఈ సినిమా గురించి రష్మిక మాట్లాడుతూ...‘‘అన్ని భాషల్లో ప్రేక్షకుల అభిమానాన్ని పొందడం నా అదృష్టంగా భావిస్తున్నా. ఓ నటిగా నేను అందరికీ చేరువయ్యే చిత్రం ఇది. సినిమాకి భాష ఎంత మాత్రం అవరోధం కాదు. ‘మిషన్‌‌ మజ్ను’లో నటిస్తుండం చాలా ఆనందంగా ఉంది. చిత్రబృందానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఈ చిత్రంతో బాలీవుడ్‌లో నా ప్రయాణాన్ని, కొత్త ప్రేక్షకులను పొందుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది’’ అని వెల్లడించింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని