పవన్‌కు కొడాలి నాని కౌంటర్‌ - mla nani fires on pawan kalyan
close
Published : 29/12/2020 13:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పవన్‌కు కొడాలి నాని కౌంటర్‌

గుడివాడ: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తనపై చేసిన వ్యాఖ్యలపై ఏపీ పౌరసరఫరాల శాఖమంత్రి కొడాలి నాని ఘాటుగా ప్రతిస్పందించారు.మంగళవారం గుడివాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...గుడివాడ నియోజకవర్గంలో ఎక్కడా పేకాట క్లబ్బులు నిర్వహించడం లేదన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్లబ్‌లను మూసివేయిస్తోంది తప్ప ప్రోత్సహించడం లేదని స్పష్టం చేశారు. పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యలను తోసిపుచ్చిన నాని.. బాధ్యత గల మంత్రిగా ప్రజలకు సమాధానం చెప్పేందుకే స్పందిస్తున్నానన్నారు. పవన్‌ కల్యాణ్‌ తనని తాను వకీల్‌ సాబ్‌ అనుకుంటే జనం మరో విధంగా భావిస్తున్నారని విమర్శించారు. పవన్‌ కల్యాణ్‌ సినిమాలు ఆపాలని ఎవరూ కోరలేదని, తనంతట తానే స్వయంగా సినిమాలు ఆపేస్తున్నట్టు గతంలో ప్రకటించారని గుర్తు చేశారు. చంద్రబాబు సొంత పుత్రుడు ఒకవైపు, దత్త పుత్రుడు మరో వైపు రాష్ట్రంలో పర్యటిస్తున్నారని విమర్శించారు. పవన్‌కు మరోసారి ప్యాకేజీ అందడంతో పర్యటనలు వేగవంతం చేశారని ఎద్దేవా చేశారు.

పవన్‌ ఏమన్నారంటే...
నిన్న మచిలీపట్నం పర్యటన సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ... ‘‘నేను సినిమాలు చేస్తున్నానని విమర్శిస్తున్న వైకాపా నేతలు మీరు చేస్తున్నదేమిటి.? దేశ సేవా.? మీరంతా గాంధీ మహాత్ములా.? పేకాట క్లబ్బులు నడిపే మీరు రాజకీయం చేయగా లేనిది.. కష్టపడి, నిజాయతీగా సినిమాలు చేసుకుంటూ నేను రాజకీయాలు చేయకూడదా.? సిమెంట్ ఫ్యాక్టరీలు, మైనింగ్‌, మీడియా సంస్థలు నడిపి మీరు రాజకీయం చేస్తుంటే.. మేం ఎందుకు చేయకూడదు. ఎంతసేపూ మీరంటున్న మాటలు పడుతూ.. మీ కిందే ఊడిగం చేయాలా.? ఆ రోజులు పోయాయి. ఎదురు తిరిగే రోజులు వచ్చాయి. చొక్కా పట్టుకుని నిలదీసే రోజులివి. జాగ్రత్తగా ఉండండి. మీరు అన్ని వ్యాపారాలు వదిలేసి వస్తే నేనూ సినిమాలు వదిలేసి రాజకీయాలు చేస్తా. ఓడిపోయినా ప్రజల కోసం వచ్చాం. భయపడితే పనులు కావు. మాకు భయాల్లేవ్‌.? మీకు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నది ఎందుకు.? ఇసుక, మైనింగ్‌, మద్యం మాఫియాతో అడ్డగోలుగా దోచుకునేందుకా.?’’ అని ప్రశ్నించారు.

ఇవీ చదవండి...

రైతులకు రూ.35వేలు ఇవ్వకపోతే.. అసెంబ్లీని ముట్టడిస్తాం

స్టేలతో అడ్డుకున్నారుమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని