ఏపీలో న్యాయం జరగదు: దీపక్‌రెడ్డి - mlc deepak reddy press meeet
close
Published : 06/09/2020 13:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏపీలో న్యాయం జరగదు: దీపక్‌రెడ్డి

అనంతపురం: ప్రజా సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని తెలుగుదేశం ఎమ్మెల్సీ దీపక్‌ రెడ్డి విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తనను అక్రమంగా నిర్భందించడానికి కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చిందంటూ తప్పుడు పత్రాలను చూపించి కుట్రపన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్న ఘటనలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని దీపక్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. 

పోలీస్‌ స్టేషన్‌లో పోలీసులే ఓ దళిత యువకుడికి శిరోముండనం చేశారంటే వ్యవస్థల్ని ఎలా కుప్పకూల్చారో అర్థం చేసుకోవచ్చన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పేదవాడికి న్యాయం జరిగే పరిస్థితిలేదన్నారు. పోలీసు వాహనాలు వినియోగించుకుని కిడ్నాప్‌లు జరగడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. పేద ప్రజలకు ఇబ్బందులు ఎదురైతే ఎక్కడికక్కడ ప్రైవేటు కేసులు పెట్టాలని తెలుగుదేశం పార్టీ తరఫున దీపక్‌రెడ్డి పిలుపునిచ్చారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని