అద్భుతమైన విజయం.. యోగికి మోదీ కంగ్రాట్స్‌ - modi appriciate yogi govt
close
Published : 04/07/2021 01:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అద్భుతమైన విజయం.. యోగికి మోదీ కంగ్రాట్స్‌

దిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో భాజపా విజయదుందుభి మోగించడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో అభివృద్ధి, ప్రజా సేవ, న్యాయమైన పాలనను ప్రజలు ఆశీర్వదించారన్నారు. సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వ విధానాలు, పార్టీ కార్యకర్తల అవిశ్రాంత కృషి ఫలితంగానే ఈ గొప్ప విజయం సాధ్యమైందని పేర్కొన్నారు. యూపీ ప్రభుత్వం, భాజపాకు ఆయన అభినందనలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు. 

యూపీలో 75 జిల్లా పంచాయతీలకు ఎన్నికలు జరగ్గా.. భాజపా మద్దతుదారులు 67 పంచాయతీ అధ్యక్ష పీఠాలను దక్కించుకొంది. ప్రజా సంక్షేమ విధానాలు, మోదీ, యోగి ఆదిత్యనాథ్‌ పాపులారిటీయే తమ పార్టీ విజయానికి కారణమని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్రదేవ్‌ సింగ్‌ అన్నారు. ఇదే ఉత్సాహంతో  2022 అసెంబ్లీ ఎన్నికల్లోనూ గెలుపొందుతామని విశ్వాసం వ్యక్తంచేశారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని