సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌కు స్వస్తి పలకాలి: మోదీ - modi asks street vendors to stop single use plastic for drinking water
close
Published : 09/09/2020 14:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌కు స్వస్తి పలకాలి: మోదీ

భోపాల్‌: తాగునీటి కోసం సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ను నిషేధించాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. పీఎం ఆత్మనిర్భర్‌ నిధి కింద లబ్ది పొందుతున్న మధ్యప్రదేశ్‌కు చెందిన వీధి వ్యాపారులతో ఆయన బుధవారం వీడియోకాల్‌ ద్వారా సంభాషించారు. ఈ సందర్భంగా మోదీ వారికి పలు సూచనలు చేశారు. తాగునీటి కోసం అందరూ సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌కు స్వస్తి చెప్పి మట్టి కుండల వైపు మొగ్గు చూపాలని సూచించారు. చగన్‌లాల్‌ అనే చీపుర్ల తయారీ వ్యాపారితో మాట్లాడుతూ..  వారి కుటుంబానికి ఉజ్వల్‌ యోజన పథకం ఎలా లబ్ది చేకూర్చిందని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా వ్యాపారాన్ని ఎలా వృద్ధి చేసుకోవాలో సూచనలు చేశారు. గ్వాలియర్‌కు చెందిన మహిళకు ఆయుష్మాన్‌ పథకం ప్రాధాన్యం తెలిపారు. కూరగాయల వ్యాపారులు లావాదేవీల కోసం డిజిటల్‌ సాంకేతికతను ఉపయోగించడంపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. అ పద్దతిని వారు అలాగే కొనసాగించాలని ప్రోత్సహించారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని