టీకా కొరతకు ప్రభుత్వమే కారణం: సోనియా - modi government mismanaged covid and exported vaccine allowed shortage says sonia gandhi
close
Published : 11/04/2021 02:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టీకా కొరతకు ప్రభుత్వమే కారణం: సోనియా

కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులతో వర్చువల్‌ సమావేశం

దిల్లీ: దేశంలో కరోనా తీవ్రరూపం దాలుస్తుండటంతో రాష్ట్రాల్లో కట్టడి చర్యలు చేపట్టాలని కాంగ్రెస్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ దిశానిర్దేశం చేశారు. ఆయా రాష్ట్రాల్లోని కాంగ్రెస్‌ ముఖ్యమంత్రులతో ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ శనివారం వర్చువల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ ప్రధాన నేత రాహుల్‌ గాంధీ కూడా పాల్గొన్నారు. కరోనా రెండో దశ కోరలు చాస్తున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లోని పరిస్థితులను తెలుసుకున్నారు. మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్‌, రాజస్థాన్‌ సహా పలు రాష్ట్రాల్లో టీకాల కొరత ఏర్పడ్డ నేపథ్యంలో కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో టీకా లభ్యతపై ఆరా తీశారు. కరోనా విస్తృత టెస్టులు నిర్వహిస్తూ.. వ్యాక్సినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలే టీకా కొరతకు కారణమని  సోనియాగాంధీ ఈ సందర్భంగా ఆరోపించారు. 

‘దేశంలోని ప్రజలకు టీకా అందించడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత. దేశానికి సరిపడా నిల్వ ఉంచుకొని, తర్వాత ఎగుమతులు చేయడం గానీ, బహుమతిగా ఇవ్వడం కానీ చేయాల్సింది. కానీ మోదీ ప్రభుత్వం సరైన లెక్కలు వేయలేకపోయింది. టీకాలను ఎగుమతి చేసి.. దేశంలో వ్యాక్సిన్‌ కొరత సృష్టించింది’ అని సోనియా గాంధీ విమర్శించారు.

అసెంబ్లీ ఎన్నికల ప్రచారం, సమావేశాల గురించి కూడా ఆమె మాట్లాడారు. ఎన్నికలు, మతపరమైన కార్యక్రమాల కోసం సామూహిక సమావేశాలు నిర్వహించడం కూడా కరోనా తీవ్రతకు కారణమయ్యాయి. ఈ విషయం ఒప్పుకోక తప్పదు. రాజకీయ ప్రయోజనాలకంటే దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇవ్వాలి అని పేర్కొన్నారు. మహమ్మారి కట్టడికి రాష్ట్రాల్లో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రులకు సూచించారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని