కరోనా ఉద్ధృతి.. సీఎంలతో మోదీ భేటీ - modi interact with cms over corona infections
close
Updated : 17/03/2021 14:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా ఉద్ధృతి.. సీఎంలతో మోదీ భేటీ

దిల్లీ: కొన్ని రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం రాష్ట్రాల మఖ్యమంత్రులతో సమావేశమయ్యారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరుగుతున్న ఈ భేటీలో కరోనా తాజా పరిస్థితులు, వైరస్‌ నియంత్రణ, వ్యాక్సినేషన్‌ కొనసాగుతున్న తీరును ప్రధాని సమీక్షిస్తున్నారు. కాగా.. ఈ సమావేశానికి ఛత్తీస్‌గఢ్‌, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రులు భూపేశ్‌ భగేల్‌, మమతా బెనర్జీ గైర్హాజరయ్యారు.

గతేడాది కొవిడ్‌ ఉద్ధృతి సమయంలోనూ పలుమార్లు రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మోదీ.. టీకా ప్రారంభానికి ముందు  ఈ ఏడాది జనవరిలోనూ ముఖ్యమంత్రులతో వర్చువల్‌గా మాట్లాడారు. ఇటీవల మహారాష్ట్ర సహా కొన్ని రాష్ట్రాల్లో కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో నేడు మరోమారు సమీక్ష చేపట్టారు.

ఆ 6 రాష్ట్రాల్లోనే..

దేశంలో గత కొంతకాలంగా రోజువారీ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అయితే మొత్తం నమోదవుతున్న కేసుల్లో 80శాతానికి పైగా కేవలం ఆరు రాష్ట్రాల్లోనే ఉంటున్నాయి. 60శాతం కేసులు ఒక్క మహారాష్ట్రలోనే ఉండగా.. తమిళనాడు, కేరళ, పంజాబ్‌, కర్ణాటక, గుజరాత్‌లోనూ కేసులు నానాటికీ పెరుగుతున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని