Bollywood: టైగర్‌.. నీ గీతం బాగుంది..! - modi praising tiger shroff for vandemataram
close
Updated : 16/08/2021 16:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Bollywood: టైగర్‌.. నీ గీతం బాగుంది..!

‘వందేమాతరం’ పాట సృజనాత్మక ప్రయత్నమన్న ప్రధాని

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ నటుడిగా, కండలవీరుడిగా ప్రేక్షకుల మెప్పు పొందిన టైగర్‌ ష్రాఫ్‌ తొలిసారి ‘వందేమాతరం’ గీతంతో గాయకుడిగా మారిన సంగతి తెలిసిందే. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ దేశభక్తి గీతాన్ని దేశానికి కానుకగా ఇచ్చారు. ‘ఇది కేవలం పాట మాత్రమే కాదు ఓ భావోద్వేగం. దీన్ని దేశానికి అంకితమిస్తున్నా’ అని తెలిపారు ష్రాఫ్‌. ఈ పాట విన్న ప్రధాని నరేంద్ర మోదీ టైగర్‌ను అభినందిస్తూ ట్వీట్ చేశారు. ‘‘ టైగర్‌! ఈ పాట ఒక  సృజనాత్మక ప్రయత్నం. ‘వందేమాతరం’ గేయంతో నువ్వు చెప్పిన దాన్ని పూర్తిగా అంగీకరిస్తున్నా’’ అన్నారు. శాల్‌ మిశ్రా స్వరాలు సమకూర్చిన ఈ గీతానికి కౌశల్‌ కిశోర్‌ సాహిత్యం అందించారు. రెమో డిసౌజా దర్శకత్వం వహించిన ఈ పాటలో మోదీ అమర వీరుల స్థూపం దగ్గర సెల్యూట్‌ చేసిన దృశ్యాన్ని జత చేశారు. ‘హిందూస్థాన్‌ మేరీ జాన్‌’ అంటూ ప్రారంభమైన ఈ పాట భారతీయులందరినీ హత్తుకునేలా ఉంది. ష్రాఫ్‌ గానం, నాట్యంతో పాటు లొకేషన్లు ఆకట్టుకున్నాయి. ఇప్పటి వరకూ 27 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుందీ పాట.




Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని