సీఎంలతో మోదీ భేటీకి దీదీ దూరం..! - modi to chair review meeting with cms mamata likely to skip
close
Published : 08/04/2021 11:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సీఎంలతో మోదీ భేటీకి దీదీ దూరం..!

దిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోన్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. గురువారం సాయంత్రం 6.30 గంటలకు వర్చువల్‌గా జరగనున్న ఈ భేటీలో కొవిడ్‌ తాజా పరిస్థితులు, వ్యాక్సినేషన్‌ సంబంధిత అంశాలపై ప్రధాని ముఖ్యమంత్రులతో చర్చించనున్నారు. అయితే, ఈ సమావేశానికి పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దూరంగా ఉంటున్నట్లు సమాచారం. ఆమె స్థానంలో బెంగాల్‌ ప్రధాన కార్యదర్శి ఆలాపన్‌ బందోపాధ్యాయ్‌ హాజరుకానున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. 

కాగా.. దేశంలో కరోనా పరిస్థితులపై మోదీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించడం ఐదు రోజుల్లో ఇది రెండోసారి. గత ఆదివారం కేంద్ర, రాష్ట్రాల ఉన్నతాధికారులతో సమావేశమైన ప్రధాని.. కరోనా కట్టడికి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఐదంచెల వ్యూహాన్ని అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు. టెస్టింగ్‌ (పరీక్షలు జరపడం); ట్రేసింగ్‌ (బాధితులకు సన్నిహితంగా మెలిగినవారిని గుర్తించడం); ట్రీట్‌మెంట్‌ (చికిత్సలు); కొవిడ్‌ జాగ్రత్తలు, నిబంధనలను పాటించడం; వ్యాక్సినేషన్‌.. ఈ పంచముఖ వ్యూహాన్ని అత్యంత నిబద్ధతతో, కట్టుదిట్టంగా అమలుచేస్తేనే మహమ్మారి నియంత్రణ సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని