ఈ తరంలో కోహ్లీయే నం.1: మహ్మద్ యూసుఫ్‌ - mohammad yousug heaped rich praise on virat kohli saying number one batsman in today era
close
Published : 15/05/2021 01:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈ తరంలో కోహ్లీయే నం.1: మహ్మద్ యూసుఫ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈ తరం క్రికెటర్లలో టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీయే నంబర్‌ వన్‌ ఆటగాడని పాకిస్థాన్ మాజీ బ్యాట్స్‌మన్‌ మహ్మద్‌ యూసుఫ్ అన్నాడు. తాజాగా ఓ యూట్యూబ్‌ ఛానెల్లో మాట్లాడిన సందర్భంగా అతడీ వ్యాఖ్యలు చేశాడు. కోహ్లీ ప్రాక్టీస్‌ చేయడం తానెప్పుడూ చూడలేదని చెప్పాడు. అయితే, ఎవరైనా తనని నేటి తరం క్రికెట్‌ అంటే ఏమిటని అడిగితే అది ట్రైనింగ్‌ అనే చెప్తానన్నాడు. ఇప్పటి కుర్రాళ్లు ఫిట్‌నెస్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని, కోహ్లీ అద్భుత ప్రదర్శనలకు కూడా అదే కారణమని అభిప్రాయపడ్డాడు.

‘కోహ్లీకి వన్డేల్లో, టెస్టుల్లో కలిపి 70 శతకాలున్నాయి. వన్డేల్లో 12 వేల పరుగులు సాధించిన అతడు టెస్టుల్లో 10 వేల పరుగులకు చేరువయ్యాడు. ఇక టీ20ల్లోనూ మంచి పరుగులే సాధించాడు. మూడు ఫార్మాట్లలోనూ అతడి ప్రదర్శన అత్యద్భుతంగా ఉంది. ఈ తరంలో నంబర్‌ వన్‌ బ్యాట్స్‌మన్‌ అంటే అతడే. నేను ఇంతకుముందే ఒక విషయం చెప్పాను. పాత తరం క్రికెటర్లతో ఇప్పటి ఆటగాళ్లను పోల్చడం సరికాదు. అది పక్కనపెడితే కోహ్లీ ప్రదర్శనలు నమ్మశక్యం కానివి’ అని యూసుఫ్‌ చెప్పుకొచ్చాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని