‘పెద‌రాయుడు’ గుర్తుగా ‘స‌న్ ఆఫ్ ఇండియా’ పాట‌ - mohan babu new film son of india first song will release on pedarayudu movie released
close
Published : 13/06/2021 14:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘పెద‌రాయుడు’ గుర్తుగా ‘స‌న్ ఆఫ్ ఇండియా’ పాట‌

ఇంట‌ర్నెట్ డెస్క్‌: మోహ‌న్ బాబు హీరోగా డైమండ్ ర‌త్న‌బాబు తెర‌కెక్కిస్తోన్న చిత్రం  ‘స‌న్ ఆఫ్ ఇండియా’. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకి ఇళ‌యరాజా స్వ‌రాలు స‌మ‌కూరుస్తున్నారు. జూన్ 15న తొలి పాట‌ని విడుద‌ల చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు మోహ‌న్ బాబు. త‌న కెరీర్‌లో సూప‌ర్ హిట్‌గా నిలిచిన ‘పెదరాయుడు’ చిత్రం విడుదలైన రోజునే త‌న కొత్త చిత్రానికి సంబంధించిన లిరిక‌ల్ వీడియో విడుద‌ల చేస్తున్న‌ట్టు తెలిపారు.

‘‘1995 జూన్ 15  ‘పెద‌రాయుడు’ రిలీజైన 26 సంవ‌త్స‌రాల‌ త‌ర్వాత 2021 జూన్ 15న  ‘స‌న్ ఆఫ్ ఇండియా’ చిత్రానికి సంబంధించిన లిరిక‌ల్ వీడియో రిలీజ్ కానుండటం  శుభ‌సూచకంగా భావిస్తున్నాను. అప్పుడు  ‘పెద‌రాయుడు’ చిత్రానికి నిర్మాత నేనైతే.. ఇప్పుడు ఈ  ‘స‌న్ ఆఫ్ ఇండియా’ చిత్రానికి నిర్మాత నా త‌న‌యుడు విష్ణు వ‌ర్థ‌న్ బాబు కావ‌డం సంతోదాయకం. ‘స‌న్ ఆఫ్ ఇండియా’కు సంబంధించి 11వ శ‌తాబ్ద‌పు ర‌ఘువీర గద్యం.. మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా సంగీత సార‌థ్యంలో రాహుల్ నంబియార్ స్వ‌రంతో లిరిక‌ల్ వీడియోగా మీ ముందుకు తీసుకొస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ పాట‌ని మ‌ర్యాద పురుషోత్త‌ముడైన శ్రీరాముడికి అంకితం ఇస్తున్నాను’’ అని అన్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని