Mohan Babu: అల‌రిస్తోన్న ‘స‌న్ ఆఫ్ ఇండియా’ సాంగ్‌   - mohan babu new film son of india fisrt song jaya jaya mahaveera released
close
Updated : 15/06/2021 14:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Mohan Babu: అల‌రిస్తోన్న ‘స‌న్ ఆఫ్ ఇండియా’ సాంగ్‌ 

ఇంట‌ర్నెట్ డెస్క్‌: మోహ‌న్ బాబు హీరోగా తెర‌కెక్కుతోన్న చిత్రం ‘స‌న్ ఆఫ్ ఇండియా’. డైమండ్ ర‌త్న‌బాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ చిత్రంలోని తొలి గీతాన్ని (లిరిక‌ల్ వీడియో) తాజాగా విడుద‌ల చేసింది చిత్ర బృందం. ‘జ‌య జ‌య మ‌హావీర మ‌హాధీర’ అంటూ సాగే ఈ ర‌ఘువీర గ‌ద్యం ఆద్యంతం అల‌రిస్తోంది. ఇళ‌య‌రాజా స్వ‌రాలు స‌మ‌కూర్చ‌గా రాహుల్ నంబియార్ ఆల‌పించారు. పాట‌కు త‌గ్గ‌ట్టు మోహ‌న్ బాబు ప‌లికించిన‌ హావభావాలు ఆక‌ట్టుకుంటున్నాయి. మోహ‌న్ బాబు కెరీర్‌లో సూప‌ర్ డూప‌ర్ హిట్‌గా నిలిచిన ‘పెద‌రాయుడు’ చిత్రం 26 ఏళ్లు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా ఈ గీతాన్ని విడుద‌ల చేశారు. ప్ర‌గ్యా జైస్వాల్‌, శ్రీకాంత్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, ఆలీ, వెన్నెల కిశోర్, పృథ్వీరాజ్‌, ర‌ఘుబాబు, రాజా ర‌వీంద్ర త‌దిత‌రులు ఈ చిత్రంలో న‌టిస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్ట‌రీ ప‌తాకంపై మంచు విష్ణు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని