మరో సస్పెన్స్‌ థ్రిల్లర్‌తో వస్తున్న ‘దృశ్యం’ కాంబో! - mohanlal and drishyam director jeethu joseph collaborate again for suspense-thrill
close
Updated : 07/07/2021 14:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మరో సస్పెన్స్‌ థ్రిల్లర్‌తో వస్తున్న ‘దృశ్యం’ కాంబో!

తిరువనంతపురం: విలక్షణ నటుడు మోహన్‌లాల్‌- దర్శకుడు జీతూ జోసెఫ్‌ కలిస్తే వచ్చే సస్పెన్స్‌ థిల్లర్‌ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. 2013లో ‘దృశ్యం’తో పాటు 2021లో వచ్చిన ‘దృశ్యం-2’ ఈ రెండూ ప్రేక్షకులపై చెరగని ముద్రవేశాయి. అంతేకాదు.. ‘దృశ్యం’తో పాటు దాన్ని సీక్వెల్‌ను తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ రూపొందించారు. ఇంతలా అలరించిన ఈ జోడి మళ్లీ అభిమానులకు తీపి కబురు చెప్పింది. ఇదే విషయాన్ని నటుడు మోహన్‌లాల్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వెల్లడించారు.

‘‘నా తదుపరి చిత్రం 12th మ్యాన్‌ జీతూ జోసెఫ్‌ దర్శకత్వంలో రాబోతుంది. చాలా సంతోషంగా ఉంది. ఆంటోనీ పెరుంబవూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు’’ అని ప్రకటించారు. చీకటిలో బంగ్లా ముందు మోహన్‌లాల్‌ నిలబడిన చిత్ర పోస్టర్‌ అంచనాలను పెంచుతోంది. మరోవైపు జీతూ జోసెఫ్‌ తెలుగులో వెంకటేశ్‌తో ‘దృశ్యం2’ను రీమేక్‌ చేసేశారు. ప్రస్తుతం తమిళ నటుడు కమల్‌హాసన్‌తో అదే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని