అఖిల్‌ కొత్త చిత్రంలో మోహన్‌లాల్‌? - mohanlal to play in akhil akkinenis next movie
close
Updated : 16/03/2021 15:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అఖిల్‌ కొత్త చిత్రంలో మోహన్‌లాల్‌?

ఇంటర్నెట్‌ డెస్క్: ఒకవైపు కథానాయకుడిగా నటిస్తూనే మరోవైపు ఇతర భాషల్లోని చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తూ మెప్పిస్తున్న మలయాళీ నటుడు మోహన్‌లాల్‌. తాజాగా మరోసారి ఆయన తెలుగులో నటించేందుకు సిద్ధమయ్యారని టాక్‌. అఖిల్‌ కథానాయకుడిగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. స్పై థ్రిల్లర్‌ నేపథ్యంగా రానున్న ఈ సినిమాలో మోహన్‌లాల్‌ కీలకపాత్ర పోషించనున్నారని టాక్‌. దర్శకుడు సురేందర్‌రెడ్డి ఇప్పటికే ఆయనతో చర్చలు కూడా జరిపారట. ఈ సినిమాలో నటించడానికి మోహన్‌లాల్‌ ఆసక్తిగా ఉన్నారని సమాచారం. కానీ, దీనిపై చిత్ర నిర్మాణ సంస్థ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

అమెరికన్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘ది బార్న్’ సిరీస్‌ స్ఫూర్తిగా ఈ చిత్రం రూపొందనుంది. ‘అఖిల్ ‌5’ వర్కింగ్‌ టైటిల్‌గా వస్తోన్న ఈ సినిమా త్వరలోనే ప్రారంభం కానుంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై అనిల్‌ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి సురేందర్‌రెడ్డి సహ నిర్మాత వ్యవహరించనున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతం అఖిల్‌ - బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కతున్న ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌’ నటిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక.  ఈ ఏడాది జూన్‌ 19న చిత్రాన్ని ప్రేక్షకుల ముందకు తీసుకురానున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని