WTC Final: అలా ఉంటే భారత్‌కు కష్టమే! - monty panesar says india will struggle in wtc finals if conditions are favour for fast bowlers
close
Published : 24/05/2021 01:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

WTC Final: అలా ఉంటే భారత్‌కు కష్టమే!

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో పరిస్థితులు పేసర్లకు అనుకూలంగా ఉంటే టీమ్‌ఇండియాకు కష్టమని ఇంగ్లాండ్‌ మాజీ స్పిన్నర్‌ మాంటీ పనేసర్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో వర్షాలు పడుతున్నాయని, వాతావరణం చల్లగా ఉందని చెప్పాడు. టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో ఇలాంటి వాతావరణమే నెలకొంటే మ్యాచ్‌ ఆసక్తికరంగా సాగుతుందన్నాడు. అప్పటికి మైదానంలో పచ్చిక ఉంటే బంతి స్వింగ్‌ అయ్యే ప్రమాదం ఉందన్నాడు. దాంతో టీమ్ఇండియా బ్యాట్స్‌మన్‌ ఎలా ఆడతారనేది చూడాలని పనేసర్‌ చెప్పుకొచ్చాడు.

వచ్చేనెల 18 నుంచి భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య సౌథాంప్టన్‌ వేదికగా తొలిసారి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పనేసర్‌ మీడియాతో మాట్లాడుతూ తన అభిప్రాయాలు చెప్పాడు. ఒకవేళ ఫైనల్‌ నాటికి వాతావరణం బాగుండి ఎండలు కాస్తే భారత్‌కు కలిసొస్తుందని తెలిపాడు. మ్యాచ్‌ జరిగే సౌథాంప్టన్‌లో సహజంగా ఆ సమయంలో పొడి వాతావరణం ఉంటుందని, దాంతో మ్యాచ్‌ నాలుగైదు రోజులు జరిగే అవకాశం ఉందని ఇంగ్లాండ్‌ మాజీ స్పిన్నర్ వివరించాడు. ఈ క్రమంలోనే టీమ్‌ఇండియా.. ఇద్దరు స్పిన్నర్లు, ముగ్గురు సీమర్లతో బరిలోకి దిగితే న్యూజిలాండ్‌కు కష్టాలు తప్పవన్నాడు. దాంతో వాతావరణ పరిస్థితుల మీదే ఫలితం ఆధారపడిందని పనేసర్‌ అంచనా వేశాడు.

మరోవైపు జూన్‌ 2 నుంచి ఇంగ్లాండ్‌తో ప్రారంభమయ్యే రెండు టెస్టుల సిరీస్‌లో న్యూజిలాండ్‌ గెలిస్తే ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లోనూ విలియమ్సన్‌ టీమ్‌ భారత్‌పై ఆధిపత్యం చెలాయిస్తుందని చెప్పాడు. ఒకవేళ ఇక్కడ కివీస్‌ ఓడిపోతే భారత్‌ పైచేయి సాధిస్తుందని లెక్కలు వేశాడు. ఇక టీమ్‌ఇండియా ఆస్ట్రేలియా పర్యటనపై స్పందించిన మాజీ స్పిన్నర్‌.. కఠిన పరిస్థితుల్లో నెగ్గుకొచ్చిన జట్టే టాప్‌ టీమ్‌గా మారుతుందని అభివర్ణించాడు. ఆ పర్యటన ద్వారా టీమ్‌ఇండియా రిజర్వ్‌ బెంచ్‌ సత్తా తెలిసిందన్నాడు. ఇటీవలి కాలంలో న్యూజిలాండ్ కన్నా కోహ్లీసేనే కష్టతరమైన పరిస్థితుల్లో ఎక్కువ మ్యాచ్‌లు ఆడిందని చెప్పాడు. దాంతో ఎలాంటి పరిస్థితుల్లోనైనా గెలుస్తామనే నమ్మకం భారత జట్టుకు ఉందన్నాడు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని