ఎక్కువ నిద్రతో కరోనా సోకే అవకాశాలు తక్కువ! - more sleep will prevent corona
close
Updated : 26/03/2021 18:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎక్కువ నిద్రతో కరోనా సోకే అవకాశాలు తక్కువ!

ఇంటర్నెట్‌ డెస్క్‌: తగినంత సమయం నిద్రపోతే శారీరకంగా.. మానసికంగా ఎన్నో లాభాలున్నాయని వైద్యులు చెబుతుంటారు. తాజాగా.. చక్కటి నిద్ర వల్ల కరోనా సోకే అవకాశాలు తగ్గుతాయని ఓ అధ్యయనంలో తేలింది. బీఎంజే న్యూట్రిషన్‌ ప్రివెన్షన్‌ అండ్‌ హెల్త్‌ అనే జర్నల్‌లో ఈ మేరకు నివేదికను ప్రచురించారు. నిద్రలేమి.. మానసిక ఒత్తిళ్ల వల్ల శరీరంలో కరోనా వైరస్‌ సులువుగా ప్రవేశించే అవకాశముందట. దాంతోపాటు తీవ్రమైన జబ్బులు, వాటి నుంచి కోలుకోవడానికి దీర్ఘకాలం సమయం పట్టొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కరోనా సోకడంలో నిద్ర ప్రభావంపై పరిశోధన కోసం ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, స్పెయిన్‌, యూకే, అమెరికా దేశాల్లో కరోనా బాధితులకు చికిత్సలకు అందిస్తూ కరోనా బారిన పడిన హెల్త్‌కేర్‌ వర్కర్లపై సర్వే నిర్వహించారు. వారు ఎంత సేపు నిద్రిస్తారనే విషయంపై దృష్టి సారించి అధ్యయనం చేయగా.. 40శాతం మందికి నిద్రలేమి, మానసిక ఒత్తిళ్ల ప్రభావంతోనే కరోనా సోకినట్లు నిర్థారించారు. కాబట్టి తగినంత నిద్రపోవడం ఎంతో ముఖ్యమని తెలిపారు. రోజువారి నిద్ర కంటే.. గంట ఎక్కువగా నిద్రపోయినా.. ఒక్కో గంటకు కరోనా సోకే అవకాశాలు 12శాతం చొప్పున తగ్గుతాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని