Vaccine: రాష్ట్రాలకు 25.8కోట్ల డోసులిచ్చాం - more than 25.8 crore covid vaccine doses have been provided to states
close
Published : 12/06/2021 18:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Vaccine: రాష్ట్రాలకు 25.8కోట్ల డోసులిచ్చాం

దిల్లీ: రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం ఇప్పటివరకు 25.87 కోట్ల కరోనా టీకా డోసులను అందించింది. ఉచితంగా, రాష్ట్రాలు నేరుగా సేకరించుకునే విధానంలో ఈ మొత్తాన్ని పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ శుక్రవారం వెల్లడించింది. 

ఇప్పటివరకు 25,87,41,810 టీకా డోసులను రాష్ట్రాలకు అందించగా.. 24,76,58,855 డోసులను వినియోగించినట్లు తెలిపింది. వాటిలో వృథా అయిన డోసులు కూడా కలిసి ఉన్నట్లు చెప్పింది. ప్రస్తుతం 1.12 కోట్లకు పైగా డోసులు రాష్ట్రాల వద్ద అందుబాటులో ఉన్నట్లు వెల్లడించింది. అలాగే రానున్న మూడు రోజుల్లో మరో పది లక్షల డోసులు రాష్ట్రాలకు చేరనున్నట్లు పేర్కొంది. కరోనా కట్టడిలో భాగంగా కేంద్రం జనవరి 16న టీకా కార్యక్రమాన్ని ప్రారంభించింది. దాని కింద నిన్న 34.3లక్షల మంది టీకా వేయించుకున్నారు. 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని