Covid vaccine: టీకా కార్యక్రమంలో రికార్డు - more than 47 lakh covid 19 vaccine doses were administered
close
Updated : 22/06/2021 01:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Covid vaccine: టీకా కార్యక్రమంలో రికార్డు

సోమవారం మధ్యాహ్నం మూడింటివరకు 47లక్షలకు పైగా డోసుల పంపిణీ

దిల్లీ: దేశంలో కరోనా టీకా కార్యక్రమంలో జూన్‌ 21న  రికార్డు నమోదైంది. సోమవారం మధ్యాహ్నం మూడింటివరకు 47లక్షల మందికి పైగా టీకాలు వేయించుకున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి. టీకా కార్యక్రమ విధానంలో మార్పులు చేసి సోమవారం నుంచి 18 ఏళ్లుపైబడిన వారికి కూడా కేంద్రం ఉచితంగా టీకాలు అందిస్తోంది. ఈ కార్యక్రమ నిర్వహణలో మధ్యప్రదేశ్‌, కర్ణాటక, ఉత్తర్‌ ప్రదేశ్‌, గుజరాత్, హరియాణా రాష్ట్రాలు ముందు వరసలో ఉన్నాయి. 

‘కొవిడ్ టీకా పంపిణీ నిమిత్తం కేంద్రం మార్గదర్శకాలను సవరించింది. సోమవారం ప్రారంభమైన ఈ నూతన టీకా కార్యక్రమంలో ఇప్పటివరకు 47లక్షల మందికిపైగా టీకాలు అందాయి’ అని ఆరోగ్య శాఖ వెల్లడించింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం కేంద్రం టీకా తయారీదారుల నుంచి 75 శాతం డోసులను కొనుగోలు చేస్తుంది. వాటిలో రాష్ట్రాల వాటా 25 శాతం కూడా కలిపే ఉంది. ఆ మొత్తాన్ని రాష్ట్రాలకు ఉచితంగా అందిస్తుంది. 

ఇప్పటివరకు దేశంలో ఏప్రిల్ ప్రారంభంలో అత్యధికంగా 43 లక్షల మందికి టీకాలు వేశారు. ఆ తరవాత జూన్ 14న 38.2 లక్షల మంది టీకా వేయించుకున్నారు. అయితే ఈ రోజు ఇప్పటికే 47లక్షల మందికి టీకాలు అందగా..ఆ మార్కు 50లక్షల మార్కును దాటొచ్చని సంబంధిత అధికారి ఒకరు మీడియాకు వెల్లడించారు. టీకా నూతన విధానం కింద ఆగస్టు నుంచి రోజుకు కోటిమందికి టీకాలు వేయాలని కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు గతంలో వార్తా కథనాలువెలువడ్డాయి. 

మహమ్మారి కట్టడికి కేంద్రం జనవరి 16న కరోనా టీకా కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మంగా ప్రారంభించింది. మొదట వైద్య సిబ్బంది, తరవాత ఫ్రంట్‌లైన్ సిబ్బందిని చేర్చింది. మార్చి ఒకటిన ప్రారంభమైన రెండో దశలో 60 ఏళ్లుపైబడిన వారిని, 45ఏళ్లు దాటి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని చేర్చింది. ఏప్రిల్‌ 1న ప్రారంభమైన మూడో దశలో 45 ఏళ్లు పైబడిన వారందరినీ చేర్చింది. ఈ దశలన్నింటిలో ఇప్పటివరకు 28 కోట్ల మందికి టీకాలు అందినట్లు కేంద్రం వెల్లడించింది. 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని