డబ్బులు సంపాదించాలంటే ఇవి తప్పుకాదు..! - mosagallu first song out now
close
Published : 05/02/2021 12:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

డబ్బులు సంపాదించాలంటే ఇవి తప్పుకాదు..!

హైదరాబాద్‌: మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మోసగాళ్లు’. కాజల్‌ కథానాయిక. బాలీవుడ్‌ నటుడు సునీల్‌శెట్టి ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద ఐటీ కుంభకోణం నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది. జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి మొదటి పాటను చిత్రబృందం విడుదల చేసింది.

‘డబ్బులు సంపాదించాలంటే రైటు, రాంగు డిస్కషన్‌ వద్దు కన్నా..! స్కిమే అయినా స్క్యామే అయినా రెండు ఒకటే తప్పలేదురా అన్నా’ అంటూ సాగే ఈ పాట లిరికల్‌ వీడియో ప్రస్తుతం అందర్నీ ఆకట్టుకుంటోంది. శ్యామ్‌ సీఎస్‌ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ నిర్మిస్తోన్న ఈ సినిమాలో రుహీ సింగ్‌, నవ్‌దీప్‌, నవీన్‌చంద్రా తదితరులు నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవీ చదవండి

టాలీవుడ్‌లో బీటౌన్‌ లేడీస్‌ ‘కీ’ రోల్‌

భర్తతో విడిపోవడం బ్రేకప్‌లా ఉంది: శ్వేతాబసు ప్రసాద్‌
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని