మహేశ్‌ నెం.1.. పవన్‌ నెం.2.. మరి తారక్‌? - most tweeted about actors
close
Published : 15/12/2020 02:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మహేశ్‌ నెం.1.. పవన్‌ నెం.2.. మరి తారక్‌?

ట్విటర్‌లో తెగ మాట్లాడుకున్నారు..!

ఇంటర్నెట్‌డెస్క్‌: మహేశ్‌ బాబు నెం.1.. పవన్‌ కల్యాణ్‌ నెం.2.. విజయ్‌ నెం.3.. ఈ సంఖ్యలేంటి అనుకుంటున్నారా? మరో పదిహేను రోజుల్లో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్నాం. ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియాలో వివిధ అంశాలకు సంబంధించిన విశేషాలను సంస్థలు ప్రకటిస్తున్నాయి. తాజాగా ట్విటర్‌ ఇండియా దక్షిణ చిత్ర పరిశ్రమలో నెటిజన్లు అత్యధికంగా మాట్లాడుకున్న ప్రముఖుల జాబితాను విడుదల చేసింది. మహిళలు, పురుషులు అంటూ.. రెండు విభాగాలుగా వీటిని పంచుకుంది. 2020లో ఎక్కువ మంది ట్వీట్‌ చేసిన సూపర్‌స్టార్‌గా మహేశ్‌బాబు నిలిచారు. ఆ జాబితా మీ కోసం..

 

 1.. ‘మహర్షి’ (2019) తర్వాత మహేశ్‌ ‘సరిలేరు నీకెవ్వరు’తో అలరించారు. 2020 సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం మంచి విజయం అందుకుంది. దీని తర్వాత ఆయన ‘సర్కారు వారి పాట’కు సంతకం చేశారు. ఇందులో కీర్తి సురేశ్‌ కథానాయిక. ఈ ప్రాజెక్టు ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతోంది. ట్విటర్‌లో మహేశ్‌ను 10.9 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఆయన 31 మందిని అనుసరిస్తున్నారు.

2.. రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే సినిమాల్లో నటిస్తున్నారు పవన్‌ కల్యాణ్‌. ఈ ఏడాది ఆయన గురించి నెటిజన్లు ఎక్కువగానే ట్వీట్లు చేశారు. నిజానికి 2018 ‘అజ్ఞాతవాసి’ తర్వాత పవన్‌ పూర్తిగా జనసేన పార్టీ పనుల్లో పడ్డారు. ఎట్టకేలకు ‘పింక్‌’ రీమేక్‌ ‘వకీల్‌ సాబ్‌’కు సంతకం చేశారు. ఈ సినిమా ప్రొడక్షన్‌ పనుల్లో ఉంది. తనను 4.1 మిలియన్ల మంది ఫాలో అవుతుండగా.. పవన్‌ 250 మందిని అనుసరిస్తున్నారు.

3... కోలీవుడ్‌తోపాటు టాలీవుడ్‌లోనూ గుర్తింపు పొందిన కథానాయకుడు  విజయ్‌. ఆయన నటించిన ‘బిగిల్‌’ 2019లో విడుదలై, హిట్‌ అందుకుంది. నయనతార కథానాయికగా నటించిన ఈ సినిమాను అట్లీ తెరకెక్కించారు. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద రూ.300 కోట్లు సాధించింది. దీని తర్వాత విజయ్‌ నటించిన ‘మాస్టర్‌’ విడుదలకు సిద్ధమౌతోంది. కరోనా నేపథ్యంలో ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు. విజయ్‌ను మొత్తం 2.8 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు.

4.. ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్‌. ఆయన హీరోగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించిన ‘అరవింద సమేత’ 2018లో విడుదలై, హిట్‌ అందుకుంది. గత రెండేళ్లుగా తారక్‌ ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి నేతృత్వంలో కొమరం భీమ్‌ పాత్ర కోసం శ్రమిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కాబోతోంది. ట్విటర్‌లో తారక్‌ను 4.6 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఆయన కేవలం జక్కన్నను అనుసరిస్తున్నారు.

5.. తెరపై తనదైన నటనతో అలరిస్తున్న తమిళ స్టార్‌ సూర్య.. సామాజిక సేవలోనూ ఎప్పుడూ ముందున్నారు. పేద చిన్నారుల బంగారు భవిష్యత్తు కోసం సంస్థను ఏర్పాటు చేసి వారి చదువులకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. గత ఏడాది ‘ఎన్జీకే’,  ‘బందోబస్త్‌’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఇటీవల ‘ఆకాశం నీ హద్దురా’తో హిట్‌ అందుకున్నారు. సూర్యను 6.4 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. ఆయన 32 మందిని ఫాలో అవుతున్నారు.

6... సంక్రాంతి కానుకగా ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన ‘అల వైకుంఠపురములో..’ ఎన్ని రికార్డులు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులో తనదైన నటనతో అలరించిన అల్లు అర్జున్‌ గురించి కూడా నెటిజన్లు మాట్లాడుకున్నారు. బన్నీ ప్రస్తుతం ‘పుష్ప’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రచార చిత్రం సైతం విడుదలైంది. ట్విటర్‌లో బన్నీ భారత ప్రధాని నరేంద్ర మోదీని మాత్రమే ఫాలో అవుతున్నారు. ఆయన్ను 5.4 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు.

7.. ఇటు హీరోగా.. అటు నిర్మాతగా బిజీగా ఉన్నారు రామ్‌ చరణ్‌. ‘వినయ విధేయ రామ’ తర్వాత ‘సైరా నరసింహారెడ్డి’ నిర్మాణ బాధ్యతలు చూసుకున్న ఆయన ఇప్పుడు ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’లో అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు. ట్విటర్‌లో చెర్రీని ఒక్క మిలియన్‌ మంది ఫాలో అవుతున్నారు. ఆయన తన తండ్రి చిరంజీవిని, బాబాయ్‌ పవన్‌ కల్యాణ్‌ను మాత్రమే అనుసరిస్తున్నారు.

8.. కోలీవుడ్‌ స్టార్‌ ధనుష్‌ ‘అసురన్‌’ (2019)తో సూపర్‌ హిట్‌ అందుకున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో దాదాపు నాలుగు ప్రాజెక్టులు ఉన్నాయి. ట్విటర్‌లో ధనుష్‌ను 9.4 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. ఆయన 147 మందిని ఫాలో అవుతున్నారు.

9.. ‘జనతా గ్యారేజ్‌’తో తెలుగు వారిని ఆకట్టుకున్న మోహన్‌లాల్‌ ఆపై పలు సినిమాలతో టాలీవుడ్‌కు దగ్గరయ్యారు. త్వరలో ఆయన వైవిధ్య పాత్ర పోషించిన ‘మరక్కర్‌’ విడుదల కాబోతోంది. ఇటీవల ‘దృశ్యం 2’ చిత్రీకరణ పూర్తయింది. ట్విటర్‌లో మోహన్‌లాల్‌ను 6.2 మిలియన్ల మంది ఫాలో అవుతుండగా.. ఆయన 152 మందిని అనుసరిస్తున్నారు.

10.. చిరంజీవి ఈ ఏడాది మార్చిలో ట్విటర్‌ ఖాతా ఆరంభించారు. తరచూ తన అభిప్రాయాలు, ఆలోచనల్ని పంచుకుంటూ ట్వీట్లు చేస్తున్నారు. ఆయన్ను 828.6 వేల మంది ఫాలో అవుతున్నారు. చిరు మాత్రం ఒక్కర్ని కూడా అనుసరించడం లేదు. ‘సైరా నరసింహారెడ్డి’ హిట్‌ తర్వాత ఆయన ‘ఆచార్య’లో నటిస్తున్నారు.

ఇదీ చదవండి..
యూట్యూబ్ టాప్‌ 10లో మూడు తెలుగు పాటలు

రష్మిక మూడు ఉద్దేశాలు.. మీకు తెలుసా?



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని