close
Published : 15/12/2020 01:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సౌత్‌ హీరోయిన్స్‌.. ముందు వరుసలో ఎవరు?

ట్విటర్‌లో జోరు.. ప్రకటించిన సంస్థ

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈ ఏడాది దక్షిణ చిత్ర పరిశ్రమకు సంబంధించి కథానాయిక కీర్తి సురేశ్‌ గురించి నెటిజన్లు ఎక్కువగా ట్వీట్లు చేశారు. ట్విటర్‌ ఇండియా చిత్ర పరిశ్రమలో నెటిజన్లు అత్యధికంగా మాట్లాడుకున్న కథానాయికల జాబితా విడుదల చేసింది. ఇందులో కీర్తి సురేశ్‌ టాప్‌-1లో నిలిచారు. ‘మహానటి’ తర్వాత ఆమె కెరీర్‌ ములుపు తిరిగిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది కథానాయిక ప్రాధాన్యం ఉన్న రెండు చిత్రాలు ‘పెంగ్విన్‌’, ‘మిస్‌ ఇండియా’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మరోపక్క ‘గుడ్‌ లక్‌ సఖి’, ‘మరక్కర్’, ‘రంగ్‌దే’, ‘అన్నాత్తే’ తదితర చిత్రాల్లో నటిస్తున్నారు. ఇవన్నీ ప్రొడక్షన్‌ పరంగా వివిధ దశల్లో ఉన్నాయి. ట్విటర్‌లో కీర్తి సురేశ్‌ను 3.4 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. ఆమె 260 మందిని ఫాలో అవుతున్నారు. ఈ సందర్భంగా ట్విటర్‌ ఇండియా ప్రకటించిన టాప్‌-10 జాబితా ఓ సారి చూద్దాం..


2.. 2020 కాజల్‌ జీవితంలో ఎంతో మధురమైంది. కొన్ని రోజుల క్రితం ఆమె తన ప్రియుడు గౌతమ్‌ కిచ్లును మనువాడారు. ఈ నేపథ్యంలో నెటిజన్లు ఆమెను ఉద్దేశిస్తూ ఎక్కువ ట్వీట్లు చేశారు. కాజల్‌ను 4.5 మిలియన్ల మంది ట్విటర్‌లో అనుసరిస్తున్నారు. ఆమె 266 మందిని ఫాలో అవుతున్నారు. ప్రస్తుతం ఆమె ‘ఆచార్య’లో నటిస్తున్నారు.


3.. సోషల్‌ మీడియాలో చాలా చురుకుగా ఉండే కథానాయికల్లో సమంత ఒకరు. ఆమె తన వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలన్నీ అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. కరోనా కారణంగా చిత్రీకరణలు, సినిమా విడుదలలు లేకపోయినప్పటికీ బిజీగా గడిపారు. కూరగాయలు పండించడంతోపాటు ఫ్యాషన్‌ బ్రాండ్‌ ‘సాకీ’ని స్థాపించారు. ఓ షోకు వ్యాఖ్యాతగానూ వ్యవహరిస్తున్నారు. సమంతను 8.5 మిలియన్ల మంది అనుసరిస్తుండగా.. ఆమె 199 మందిని ఫాలో అవుతున్నారు.


4.. నేషనల్‌ క్రష్‌గా మారిన రష్మిక ‘గీతా గోవిందం’ తర్వాత జోరు పెంచారు. వరుస సినిమాలతో అలరిస్తున్నారు. ఈ ఏడాది ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’తో హిట్లు అందుకున్నారు. ఆమె చేతిలో ‘సుల్తాన్‌’, ‘పొగరు’, ‘పుష్ప’, ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రాలున్నాయి. రష్మికను 2.3 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. ఆమె 207 మందిని ఫాలో అవుతున్నారు.


5.. ఇటు దక్షిణాదిలో అటు బాలీవుడ్‌లో సత్తా చాటుతున్న ముద్దుగుమ్మ పూజా హెగ్డే. ఆమె చిత్రాలు ‘అరవింద సమేత’, ‘మహర్షి’, ‘గద్దలకొండ గణేశ్‌’, ‘హౌస్‌ఫుల్‌ 4’, ‘అల వైకుంఠపురములో’ హిట్లుగా నిలిచాయి. త్వరలో ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచులర్‌’, ‘రాధేశ్యామ్‌’ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ క్రమంలో నెటిజన్లు పూజా గురించి మాట్లాడుకున్నారు. ఆమెను 2.9 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.. ఆమె 86 మందిని అనుసరిస్తున్నారు. 


6.. సామాజిక మాధ్యమాల్లో ముక్కుసూటిగా మాట్లాడే కథానాయిక తాప్సీ. విమర్శ, ప్రశంస.. ఏదైనా సరే తన స్టైల్‌లో జవాబు ఇస్తుంటారు. ఆమె కెరీర్‌ ఆరంభమైంది తెలుగు సినీ పరిశ్రమలోనే అయినా.. ఇప్పుడు బాలీవుడ్‌లో విజయవంతంగా రాణిస్తున్నారు. ఆమె గత చిత్రాలు ‘గేమ్ ఓవర్‌’, ‘మిషన్‌ మంగళ్‌’, ‘సాండ్‌ కీ ఆంఖ్‌’, ‘థప్పడ్‌’ హిట్లుగా నిలిచాయి. తాప్సీని 4.3 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. ఆమె 164 మందిని ఫాలో అవుతున్నారు.


7.. తమన్నా పూర్తిగా షూటింగ్‌ మోడ్‌లో ఉన్నారు. 2019లో ఆమె నటించిన ఏడు సినిమాలు తెరపై అలరించాయి. 2020లో ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రత్యేక గీతంలో మెరిశారు. ఇప్పుడు ‘సీటీమార్‌’తోపాటు పలు ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు. ఇటీవల ఆమె కరోనా బారినపడి, కోలుకున్నారు. తమన్నా ట్విటర్‌లో 180 మందిని అనుసరిస్తున్నారు.. ఆమెను 4.8 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.


8.. దక్షిణాదితోపాటు ఉత్తరాది ప్రేక్షకులకు దగ్గరైన భామ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. ఆమె 2019లో ‘దేవ్‌’, ‘దే దే ప్యార్‌ దే’, ‘ఎన్జీకే’, ‘మన్మథుడు 2’ తదితర చిత్రాల్లో కనిపించారు. ప్రస్తుతం ఆమె ఖాతాలో ఏడు ప్రాజెక్టులు ఉన్నాయి. రకుల్‌ను 4.4 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు.. ఆమె 302 మందిని ఫాలో అవుతున్నారు.


9.. 2017లో ‘సింగం 3’, ‘కాటమరాయుడు’, ‘బెహెన్‌ హోగీ తెరీ’ తర్వాత శ్రుతి మూడేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. కొన్ని నెలల క్రితం కోలీవుడ్‌ ప్రాజెక్టు ‘లాభం’కు సంతకం చేశారు. ఇప్పుడు ‘క్రాక్‌’, ‘వకీల్‌ సాబ్‌’లో నటిస్తున్నారు. ఆమె సినిమాలు లేకపోయినప్పటికీ ప్రజలు చర్చించుకోవడం విశేషం. శ్రుతిని ట్విటర్‌లో 7.7 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు. ఆమె 339 మందిని ఫాలో అవుతున్నారు.


10.. 18 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో విజయవంతంగా రాణిస్తున్న కథానాయిక త్రిష. ఆమె ఈ జాబితాలో పదో స్థానంలో నిలిచారు. గత ఏడాది ‘పేటా’ తర్వాత పలు ప్రాజెక్టులకు సంతకం చేశారు. ఇప్పుడు ఆమె దాదాపు ఏడు సినిమాల్లో నటిస్తున్నారు. త్రిషను ట్విటర్‌లో 5.3 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు. ఆమె 47 మందిని అనుసరిస్తున్నారు.


ఇదీ చదవండి..
యూట్యూబ్ టాప్‌ 10లో మూడు తెలుగు పాటలు

రష్మిక మూడు ఉద్దేశాలు.. మీకు తెలుసా?


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని