Crime news: డివైడర్‌ పైకి దూసుకొచ్చిన బస్సు.. తెగిపడిన తల్లి కాళ్లు - mother and son crushed by bus in haridwar
close
Published : 18/08/2021 01:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Crime news: డివైడర్‌ పైకి దూసుకొచ్చిన బస్సు.. తెగిపడిన తల్లి కాళ్లు

హరిద్వార్‌: రోడ్డు పక్కనున్న డివైడర్‌ పైకి బస్సు దూసుకువచ్చిన ఘటనలో తల్లీకొడుకులు తమ రెండు కాళ్లను కోల్పోయారు. ఉత్తరాఖండ్ హరిద్వార్‌లోని చండీచౌక్ వద్ద ఉన్న డివైడర్‌పై తల్లీకొడుకులు కూర్చొని ఉన్నారు. ఆ సమయంలో రాజస్థాన్ నుంచి ప్రయాణికులతో వస్తున్న ఓ బస్సు మలుపు తిరిగే క్రమంలో డివైడర్‌పైకి దూసుకొచ్చింది. దీంతో అక్కడే కూర్చున్న తల్లీకొడుకుల కాళ్లు బస్సుకి, డివైడర్‌కు మధ్య ప్రమాదకరంగా చిక్కుకుపోయాయి. కాళ్లు బయటకు తీయలేక వారిద్దరూ విలవిల్లాడారు. స్థానికులు అతికష్టం మీద బస్సును అవతలికి జరిపి క్షతగాత్రులను బయటకు లాగారు. అయితే బస్సు, డివైడర్‌కు మధ్య విపరీతంగా నలిగి తల్లి కాళ్లు  పూర్తిగా తెగిపోయాయి. కుమారుడి కాళ్లు పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని