గొప్ప మనసు చాటిన నటుడు ప్రకాశ్‌రాజ్‌ - movie actress prakash raj helps a student who needs money for higher studies
close
Published : 04/10/2020 01:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గొప్ప మనసు చాటిన నటుడు ప్రకాశ్‌రాజ్‌

హైదరాబాద్‌: ఆపదలో ఉన్నవారికి సాయం చేయడంలో విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌ ఎల్లప్పుడూ ముందే ఉంటారు. ఇటీవల లాక్‌డౌన్‌ సమయంలో ఎంతో మంది వలస కార్మికులకు సాయం అందించడం నుంచి తెలంగాణలో ఓ గ్రామాన్ని దత్తత తీసుకునే వరకు అన్ని విషయాలు తెలిసిందే. తాజాగా ఆయన ఓ విద్యార్థిని ఉన్నత చదువుకు సహకరించి తన దాతృత్వం చాటుకున్నారు.

పశ్చిమగోదావరి జిల్లా పెద్దేవం గ్రామానికి చెందిన సిరిచందన బీఎస్సీ కంప్యూటర్‌ సైన్స్‌ పూర్తి చేసింది. ఆమె చదువులో మంచి ప్రతిభావంతురాలు కావడంతో ఇంగ్లాండులోని మాంచెస్టర్‌ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్‌ డిగ్రీ చేయడానికి సీటు దక్కించుకుంది. తండ్రి లేకపోవడం, ఆర్థికపరిస్థితి అంతంత మాత్రం ఉండటంతో ఉన్నత చదువుపై ఆశలు వదులుకుంది. ఈ క్రమంలో ఆమె కుటుంబ సన్నిహితులు నరేంద్ర అనే వ్యక్తి నుంచి ఆన్‌లైన్‌ ద్వారా వారి పరిస్థితి తెలుసుకున్న ప్రకాశ్‌ రాజ్‌ ఆమెను చదివించేందుకు ముందుకు వచ్చారు. దీంతో ఆమె తన కుటుంబసభ్యులతో కలిసి ఇటీవల హైదరాబాద్‌లో ప్రకాశ్‌రాజ్‌ షూటింగ్‌లో ఉండగా కలుసుకుని కృతజ్ఞతలు తెలియజేశారు. బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలని ప్రకాశ్‌రాజ్‌ ఆమెను ఆశీర్వదించారు. 

ఈ సందర్భంగా సిరిచందన మాట్లాడుతూ.. ‘ప్రకాశ్‌రాజ్‌ గారు మమ్మల్ని ఆదుకునేందుకు ముందుకు రావడం ఎంతో ఆనందానికి గురిచేసింది. ఆయనను ఆదర్శంగా తీసుకుని నేను బాగా చదువుకుని భవిష్యత్‌లో మరో నలుగురికి సాయం చేయాలనుకుంటున్నా. ఆయనకు రుణపడి ఉంటా’’ అని అన్నారు. ‘‘పిల్లల చిన్నతనంలో నా భర్త చనిపోయారు. అప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడి పిల్లల్ని పెంచాను. ఇప్పుడు నా బిడ్డ చదువు బాధ్యతలు ప్రకాశ్‌ రాజ్‌ గారు తీసుకున్నారు. నన్ను సొంత చెల్లెలిగా భావించి ధైర్యమిచ్చారు. ఏమిచ్చినా ఆయన రుణం తీర్చుకోలేను’’ అని సిరి చందన తల్లి చెప్పారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని