సీఎంకు అలాంటి వ్యాఖ్యలు తగునా?   - mp jaya bachchan reacts on uttarakhand chief ministers ripped jeans comments
close
Published : 19/03/2021 01:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సీఎంకు అలాంటి వ్యాఖ్యలు తగునా? 

తీరథ్‌ సింగ్‌ వ్యాఖ్యలపై జయా బచ్చన్‌ ఆగ్రహం

దిల్లీ: మహిళల వస్త్రధారణను ఉద్దేశించి ఉత్తరాఖండ్‌ సీఎం తీరథ్‌సింగ్‌ రావత్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. చిరిగిన జీన్‌ప్యాంట్‌ వేసుకున్న మహిళలను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై ఎంపీ జయా బచ్చన్‌ స్పందించారు. ఈ వ్యాఖ్యలు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి తగినవి కాదన్నారు. ఉన్నత స్థానాల్లో ఉన్నవారు బహిరంగ వ్యాఖ్యలు చేసినప్పుడు ఆలోచించి మాట్లాడాలని ఆమె సూచించారు. ఆయన మాటలు చెడు ఆలోచనలను, మహిళలపై నేరాలను ప్రోత్సహించేలా ఉన్నాయని జయ మండిపడ్డారు. ఇలాంటి వ్యక్తులు బాధ్యతగా మాట్లాడాలన్నారు. మరోవైపు, చిరిగిన జీన్‌ (రిప్‌డ్‌ జీన్‌) వేసుకున్న ఓ మహిళను ఉద్దేశించి సీఎం కామెంట్స్‌పై సోషల్‌ మీడియాలోనూ ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఈ రోజు ట్విటర్‌లోనూ #RippedJeans అనే పేరుతో హ్యాష్‌టాగ్‌ ట్రెండిగ్‌గా మారింది. 

ఇటీవల ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తీరథ్‌‌ సింగ్‌ రావత్‌ మంగళవారం దేహ్రాదూన్‌లో ఉత్తరాఖండ్‌ స్టేట్‌ కమిషన్‌ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ ఛైల్డ్‌ రైట్స్‌ నిర్వహించిన వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓసారి విమానంలో  తన పక్కన కూర్చున్న ఓ మహిళ చిరిగిన  జీన్‌ ధరించిందని, ఆమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని తెలిపారు. ఆమె ఒక ఎన్జీవోని సైతం నడుపుతోందని చెప్పారు. ఇలాంటి మహిళ ప్రజా సమస్యలపై బయటకు వెళ్లి సభ్య సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తుంది? ఇలాంటి వస్త్రధారణ మన పిల్లలకు ఏం సంకేతాలు ఇస్తాయి? మనమేం చేస్తామో పిల్లలూ అదే ఫాలో అవుతారు. ఇంట్లోనే సంస్కృతి మూలాలు నేర్పిస్తే ఎంత ఆధునికంగా ఉన్నా ఫర్వాలేదు. జీవితంలో ఎప్పుడూ వైఫల్యం చెందరు’ అంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని