పశువుల కాపర్లకి నాటకం నేర్పిన నటుడు - ms narayana tells about his childhood in a old video
close
Published : 25/04/2021 18:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పశువుల కాపర్లకి నాటకం నేర్పిన నటుడు

ఇంటర్నెట్‌డెస్క్‌: తెలుగు సినీ పరిశ్రమలో హాస్యనటులకు కొదవేలేదు. ఎంతోమంది నటులు తమ హాస్య గుళికలతో ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్విస్తున్నారు. అయితే, వారిలో కొంతమంది కమెడియన్లు ఇప్పుడు మన మధ్య లేకపోయినప్పటికీ సినీ ప్రియుల హృదయాల్లో మాత్రం వారికి ప్రత్యేక స్థానం ఉంది. అలా ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న వారిలో ఎం.ఎస్‌. నారాయణ ఒకరు.

కాగా, ఒకానొక సమయంలో ఓ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎం.ఎస్‌.నారాయణ తన బాల్యం గురించి ఇలా చెప్పుకొచ్చారు. ‘16 ఏళ్లు ఉన్నప్పుడు ‘వీధిలో దొరలు’ అనే నాటికను రచించాను. రచించడమే కాకుండా పశువులు కాసే కుర్రాళ్లందరికీ నటించి చూపించాను. వాళ్లకి సైతం నేర్పించాను. ఎందుకంటే, అప్పట్లో నేను కూడా పశువులు కాసేవాడిని. ఆ తర్వాత దాన్ని స్టేజ్‌పై కూడా ప్రదర్శించాను. ఆ సమయంలో ముఖానికి ఉన్న మేకప్‌ చూసి అమ్మానాన్న ఎక్కడ తిడతారో అని భయపడి చీకటి పడిన తర్వాత ఇంటికి వెళ్లాను. అమ్మ వాళ్లు నిద్రించిన తర్వాత ఇంట్లోకి వెళ్లి దొంగచాటుగా భోజనం చేసి నిద్రపోయాను. ముఖానికి మేకప్‌ మాత్రం అలాగే ఉంచాను. అయితే, తెల్లవారేసరికి నా ముఖానికి ఉన్న మేకప్‌ దుప్పటికి అంటింది. దాంతో మా నాన్న నన్ను కొట్టారు. కానీ, ఆ కళామ్మతల్లే నన్ను ఇలా కరుణిస్తుందని.. ఒక హాస్యనటుడిగా నన్ను మీ ఎదుట నిలబెడుతుందని నేను అనుకోలేదు’ అని ఆయన చెప్పుకొచ్చారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని