‘ఒక్కడు’ సీక్వెల్‌కు రంగం సిద్ధమైందా..! - ms raju tweets goes viral on okkadu 2 movie
close
Published : 02/01/2021 13:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘ఒక్కడు’ సీక్వెల్‌కు రంగం సిద్ధమైందా..!

వైరల్‌గా మారిన ఎం.ఎస్‌.రాజు ట్వీట్‌

హైదరాబాద్‌: సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబును మాస్‌ అభిమానులకు చేరువ చేసిన చిత్రాల్లో ‘ఒక్కడు’ ఒకటి. అప్పటివరకూ క్లాస్‌ లుక్స్‌లో.. సాఫ్ట్‌ బాయ్‌గా కనిపించిన మహేశ్‌లోని మాస్‌ యాంగిల్‌ను ఈ సినిమా బయటపెట్టింది. ఎం.ఎస్‌.రాజు నిర్మాతగా గుణశేఖర్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా స్వీకెల్‌ గురించి ప్రస్తుతం నెట్టింట్లో చర్చ జరుగుతోంది. ఎం.ఎస్‌.రాజు పెట్టిన ఓ ట్వీటే ఇందుకు కారణం.

దాదాపు ఎనిమిదేళ్ల విరామం తర్వాత ఎం.ఎస్‌.రాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డర్టీ హరి’. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆయన సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో చేరువగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ.. త్వరలో మహేశ్‌తో తాను ఓ సినిమా చేస్తానని తెలిపారు. దీంతో సూపర్‌స్టార్‌ అభిమానులు.. ‘కథ ఏంటి? డైరెక్టర్‌ ఎవరు? ఒక్కడు-2 తెరకెక్కిస్తున్నారా?’ అంటూ వరుస ట్వీట్లు చేస్తున్నారు. ప్రస్తుతం తాను కథను సిద్ధం చేస్తున్నానని.. అన్నీ ఓకే అయ్యాక వచ్చే నెలలో ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలు వెల్లడిస్తానని రాజు చెప్పారు. అంతేకాకుండా ఒకవేళ ‘ఒక్కడు-2’ తెరకెక్కిస్తే గుణశేఖరే దర్శకత్వం వహిస్తారని ఆయన తెలిపారు.  దీంతో ‘ఒక్కడు-2’ రానుందంటూ మహేశ్‌ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు త్వరలో మహేశ్‌బాబు ‘సర్కారు వారి పాట’ షూట్‌లో పాల్గొననున్నారు.

ఇదీ చదవండి

మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో సమంతమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని