Cricket News: యువ బృందం లంకను చిత్తుచేస్తుంది! - msk prasad confident of young players in team india could win the sri lankan tour
close
Updated : 06/06/2021 07:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Cricket News: యువ బృందం లంకను చిత్తుచేస్తుంది!

ఇంటర్నెట్‌ డెస్క్‌: రాబోయే శ్రీలంక పర్యటనలో టీమ్‌ఇండియా యువబృందం ఆ జట్టును చిత్తుచేసినా ఆశ్చర్యపోనని బీసీసీఐ మాజీ చీఫ్‌ సెలెక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ పేర్కొన్నారు. తాజాగా ఆయన ఓ క్రీడా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌తో పాటు ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌ కోసం కోహ్లీసేన ఇప్పటికే సౌథాంప్టన్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే, అదే సమయంలో బీసీసీఐ జులైలో మరో టీమ్‌ఇండియా బృందాన్ని శ్రీలంక పర్యటనకు పంపాలని నిర్ణయించింది. అక్కడ మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌లు ఖరారు చేసింది. దాంతో ఆ బృందానికి సీనియర్‌ ఆటగాడు శిఖర్‌ ధావన్‌ నాయకత్వం వహించే అవకాశం ఉంది. అందులో పాండ్య సోదరులు, ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, భువనేశ్వర్‌ కుమార్‌, శ్రేయస్‌ అయ్యర్‌ లాంటి ఆటగాళ్లను ఎంపిక చేయనున్నారు.

ఈ నేపథ్యంలోనే ప్రసాద్‌ మాట్లాడుతూ ప్రస్తుతం యువ ఆటగాళ్లు అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారని, వచ్చిన వాటిని సద్వినియోగం చేసుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. ‘టీమ్‌ఇండియాలో ఇంతకుముందున్న నైపుణ్యమే ఇప్పుడూ ఉంది. అయితే, అప్పటికన్నా ఇప్పుడు ఆటగాళ్ల ఆత్మవిశ్వాసం ఐదు రెట్లు ఎక్కువగా పెరిగింది. అందుకు సూర్యకుమార్‌ యాదవ్‌ ఒక ఉదాహరణ. టీ20 క్రికెట్‌లో అతడు ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్‌గా మలిచాడు. అది కూడా ప్రపంచంలోనే మేటి బౌలర్‌ అయిన జోఫ్రా ఆర్చర్‌ బౌలింగ్‌లో. మరోవైపు ఇషాన్‌ సైతం ఇంగ్లాండ్‌తో ఆడిన అరంగేట్రం మ్యాచ్‌లోనే రెచ్చిపోయాడు. అతడు కూడా వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో యువ ఆటగాళ్లు శ్రీలంక పర్యటనలో రెండు సిరీస్‌లు గెలుపొందినా ఆశ్చర్యపోను’ అని ప్రసాద్‌ వివరించారు. ఇటీవల ఐపీఎల్‌ 14వ సీజన్‌కు ముందు స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఈ ముంబయి బ్యాట్స్‌మెన్‌ ఇద్దరూ దంచికొట్టిన సంగతి తెలిసిందే.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని