అనుష్క విషయంలో మమ్మల్ని అనవసరంగా లాగారు  - msk prasad feels selectors were unnecessarily dragged into anushkas matter serving tea in wc
close
Updated : 14/06/2021 18:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అనుష్క విషయంలో మమ్మల్ని అనవసరంగా లాగారు 

2019 ప్రపంచకప్‌లో టీ అందించడంపై: ఎమ్మెస్కే ప్రసాద్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: 2019 వన్డే ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ సతీమణి అనుష్క శర్మకు భారత సెలక్టర్లు టీ అందించారని మాజీ వికెట్‌ కీపర్‌ ఫరూక్‌ ఇంజినీర్‌ గతంలో చేసిన వ్యాఖ్యలను నాటి చీఫ్‌ సెలెక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ కొట్టిపారేశారు. తాజాగా ఓ క్రీడాఛానెల్‌తో మాట్లాడిన ఆయన ఆ వివాదాస్పద వ్యాఖ్యలపై తనదైనశైలిలో స్పందించారు. అందులో తమ సెలక్టర్లను అనవసరంగా లాగారని పేర్కొన్నారు.

స్టార్‌ ఆటగాళ్లు లేని సమయంలో టీమ్‌ఇండియా యువ క్రికెటర్లు ఆస్ట్రేలియా లాంటి బలమైన జట్టును వారి సొంతగడ్డపై ఓడించినప్పుడు ఎవరూ సెలక్టర్లను అభినందించలేదని గుర్తుచేశారు. ఎవరూ అభినందించకపోయినా తమకేం ఫర్వాలేదన్నారు. జట్టు యాజమాన్యం తమ పనితీరును గుర్తించి గౌరవించిందని ఎమ్మెస్కే చెప్పారు. తమకదే చాలని, బయటివాళ్లు ఏమనుకున్నా ఫర్వాలేదన్నారు. తాము ఏం పని చేశామో బోర్డు సభ్యులకు తెలుసని, ముఖ్యంగా టీమ్‌ఇండియా బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌, పరాస్‌ మాంబ్రేకు బాగా తెలుసని వివరించారు.

కాగా, ఎమ్మెస్కే ప్రసాద్‌ 2016 నుంచి 2020 వరకు నాలుగేళ్లు టీమ్‌ఇండియా సీనియర్‌ సెలెక్షన్‌ కమిటి ఛైర్మన్‌గా కొనసాగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అతని నేతృత్వంలో 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ, 2018-19 ఆస్ట్రేలియా పర్యటన, 2019 వన్డే ప్రపంచకప్‌ టోర్నీలకు భారత జట్టును ఎంపిక చేశారు. అయితే, ఇంగ్లాండ్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌ ఈవెంట్‌కు జట్టును ఎంపిక చేసినప్పుడు, అదే సమయంలో అనుష్కకు టీ అందించారనే ఆరోపణల నేపథ్యంలో ఈ మాజీ సెలెక్టర్‌పై విమర్శలు వచ్చాయి.  దీనిపై ప్రసాద్‌ స్పందిస్తూ బయటివాళ్లు ఏమనుకున్నా తాము చేసిన పనిని భారత జట్టు గుర్తించిందన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని