Valimai: అజిత్‌ ‘వాలిమై’ ఫస్ట్‌లుక్‌ వచ్చేసింది! - much awaited thala ajith valimai first look
close
Updated : 11/07/2021 18:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Valimai: అజిత్‌ ‘వాలిమై’ ఫస్ట్‌లుక్‌ వచ్చేసింది!

ఇంటర్నెట్‌డెస్క్‌: అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తరుణం వచ్చేసింది. హెచ్‌.వినోద్‌ దర్శకత్వంలో తమిళ అగ్ర కథానాయకుడు అజిత్‌ నటిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘వాలిమై’. తెలుగు నటుడు కార్తికేయ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. కాగా,  ఆదివారం ఈ చిత్రానికి సంబంధించి అజిత్‌ ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పోస్టర్‌ విడుదలైంది. ఇందులో అజిత్‌ సీబీ సీఐడి అధికారిగా కనిపించనున్నారు. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘వాలిమై’ ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. అజిత్‌కు జోడీగా హ్యుమా ఖురేషి నటిస్తుండగా, యువన్‌ శంకర్‌రాజా స్వరాలు సమకూరుస్తున్నారు. బేవ్యూ ప్రొజెక్ట్స్‌ పతాకంపై బోనీకపూర్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఏడాది కాలంగా ‘వాలిమై’లో అజిత్‌ ఫస్ట్‌లుక్‌ విడుదల చేయాలంటూ అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా తీవ్రంగా డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఒకానొక సందర్భంలో ఇది తారస్థాయికి చేరింది. ఏ కార్యక్రమం జరిగినా అక్కడ అభిమానులు ప్రత్యక్షమవడం అప్‌డేట్‌ ఇవ్వమంటూ నినాదాలు చేయడంతో నేరుగా అజిత్‌ స్పందించాల్సి వచ్చింది. అభిమానుల తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. సహనంతో ఉండాలని సూచించారు. ఎట్టకేలకు ఆదివారం అజిత్‌ ‘వాలిమై’ ఫస్ట్‌లుక్ విడుదల కావటంతో ఆయన అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా సంబరాలు చేసుకుంటున్నారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని