ఈ ముగ్గురు మొన‌గాళ్ల క‌థేంటి?  - mugguru monagallu first look
close
Published : 17/05/2021 14:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఈ ముగ్గురు మొన‌గాళ్ల క‌థేంటి? 

ఇంట‌ర్నెట్ డెస్క్‌: గ‌తంలో ప్ర‌ముఖ న‌టుడు చిరంజీవి న‌టించిన ‘ముగ్గురు మొన‌గాళ్లు’ చిత్రం విశేషంగా అల‌రించింది. ఇప్పుడ‌దే పేరుతో మ‌రో సినిమా సంద‌డి చేసేందుకు సిద్ధ‌మ‌వుతోంది. శ్రీనివాసరెడ్డి, దీక్షిత్ శెట్టి, వెన్నెల రామారావు ప్ర‌ధాన పాత్ర‌ల్లో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. రాజా ర‌వీంద్ర కీల‌క పాత్ర పోషిస్తున్నారు. అభిలాష్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. తాజాగా ఫ‌స్ట్‌లుక్‌ని విడుద‌ల చేసింది చిత్ర బృందం. చెడు మాట్లాడ‌కు, చూడ‌కు, విన‌కు అనే కాన్సెప్ట్‌తో కూడిన ఈ పోస్ట‌ర్‌ ఆకట్టుకుంటోంది. చిత్ర మందిర్ స్టూడియోస్ ప‌తాకంపై ఈ సినిమాని అచ్యుత్ రామారావు నిర్మిస్తున్నారు. సురేశ్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు. మ‌రి ఈ మొన‌గాళ్ల క‌థ ఏంటి? అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని