అంబానీయే నెం.1.. వరుసగా 13వసారి! - mukesh ambani got first place in forbes richest person in india
close
Updated : 08/10/2020 21:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అంబానీయే నెం.1.. వరుసగా 13వసారి!

ముంబయి: ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ సరికొత్త రికార్డు సృష్టించారు. ఫోర్బ్స్‌ భారత అత్యంత సంపన్నుల జాబితాలో వరుసగా 13వ సారి అగ్రస్థానంలో నిలిచారు. ఫోర్బ్స్‌ 2020 సంవత్సరానికి గానూ దేశంలో అత్యంత సంపన్నులైన 100 మంది జాబితాను గురువారం విడుదల చేసింది. ఆ వివరాల ప్రకారం.. ‘కరోనా కారణంగా ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒడుదొడుకులను ఎదుర్కొన్నప్పటికీ భారత కుబేరులు మాత్రం తమ సంపదని రక్షించుకున్నారు. కాగా ఆ వంద మంది సంపన్నుల సంపద విలువ 14శాతం పెరిగి 517.5 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది’ అని పేర్కొంది. 

అంతేకాకుండా ‘ఈ జాబితాలో వరుసగా 13వ సారి ముకేశ్‌ అగ్రస్థానంలో నిలిచారు. ఆయన సంపదకు 37.3 బిలియన్‌ డాలర్లు అదనమై మొత్తం 88.7బిలియన్‌ డాలర్లకు పెరిగింది’ అని ఫోర్బ్స్‌ వెల్లడించింది. కాగా ఈ ఏడాది టాప్‌ 10 జాబితాలో పుణెకు చెందిన సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఛైర్మన్‌ సైరస్‌ పూనావాలా కొత్తగా చోటు సాధించారు. సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా విదేశీ మందుల తయారీ సంస్థ ఆస్ట్రాజెనికాతో కలిసి కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఉత్పత్తి కోసం ప్రయోగాలు చేస్తున్న విషయం తెలిసిందే. రెండో స్థానంలో గౌతం అదానీ(25.2 బిలియన్‌ డాలర్లు), మూడో స్థానంలో శివ్‌ నాడార్‌(20.4బిలియన్‌ డాలర్లు), నాలుగో స్థానంలో రాధాకృష్ణ ధమానీ(15.4బిలియన్‌ డాలర్లు), ఐదో స్థానంలో హిందూజా సోదరులు(12.8బిలియన్‌ డాలర్లు)తో తొలి ఐదు స్థానాల్లో నిలిచారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని