‘గంగూబాయి’పై కేసు కొట్టివేత.. - mumbai court rejects suit against alia bhatts gangubai kathiawadi
close
Published : 19/02/2021 01:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘గంగూబాయి’పై కేసు కొట్టివేత..

ముంబయి: ఆలియా భట్‌ ప్రధాన పాత్రలో సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న చిత్రం ‘గంగూబాయి కతియావాడి’. హుస్సేన్‌ జైదీ రచించిన ‘మాఫీయా క్వీన్స్‌ ఆఫ్‌ ముంబై’లోని ‘మేడమ్‌ ఆఫ్‌ కామతిపుర’ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. అయితే ఆ పుస్తకంలోని అంశాలు తన తల్లిని అవమానపరిచే విధంగా ఉన్నాయని గంగుబాయి దత్తపుత్రుడు బాబుజీషా ఆరోపించారు. పైగా తమ వద్ద నుంచి ఎటువంటి వివరాలు తీసుకోకుండా సినిమా తెరకెక్కిస్తున్నారని, ఆ పుస్తకంతో పాటు సినిమాను వెంటనే నిలిపివేయాలని ముంబయి సిటీ కోర్టులో పిటిషన్‌ వేశాడు. దీన్ని పరిశీలించిన కోర్టు చెల్లదంటూ పిటిషన్‌ను తోసిపుచ్చింది. దీంతో భన్సాలీ సినిమా తెరకెక్కించేందుకు లైన్‌ క్లియర్‌ అయ్యింది. ఇటీవల విడులైన ‘గంగూబాయి’ ప్రచార చిత్రాల్లో ఆలియా స్టన్నింగ్‌ లుక్‌తో ఆకట్టుకుంది. అజయ్‌దేవ్‌గణ్‌ ఒక ముఖ్యపాత్రలో నటిస్తుండటం విశేషం.

ఎవరీ గంగూబాయి..?
హుస్సేన్‌ రాసిన పుస్తకం ప్రకారం 1960ల్లో గంగూబాయి తన ప్రేమికుడితో గుజరాత్ నుంచి  పారిపోయి ముంబయికి చేరుకుంది. మోసం చేసిన ప్రియుడు ఆమెను వ్యభిచార గృహాలకు  అమ్మేశాడు.అనంతరం తానే కొన్ని వ్యభిచార గృహాలను నడిపేది. అలా ఆమె ‘మేడమ్ ఆఫ్‌ కామతిపుర’గా పిలువబడింది. అప్పట్లో ఉన్న బడా ముంబయిడాన్‌లతో ఆమెకు పరిచయాలుండేవి. తర్వాత కాలంలో సెక్స్‌వర్కర్ల హక్కుల కోసం పోరాడింది. వారు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కారం చూపింది. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని