ఆలియా, సంజయ్‌లకు కోర్టు సమన్లు - mumbai court summons alia sanjay leela bhansali
close
Published : 25/03/2021 13:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆలియా, సంజయ్‌లకు కోర్టు సమన్లు

ముంబయి: ‘గంగూబాయ్ కతియావాడి’ విషయమై బాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలీ, నటి ఆలియాభట్‌కు మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు సమన్లు జారీ చేసింది. మే 21న కోర్టులో హాజరు కావాలని ఆదేశించింది. ‘గంగూబాయ్‌ కతియావాడి’లో గంగూబాయ్‌ని కించపరిచేలా సన్నివేశాలున్నాయని పేర్కొంటూ ఆమె దత్త పుత్రుడు రాజీవ్‌ షా కోర్టులో దర్శకుడు, నటిపై పరువు నష్టం దావా వేశారు. గురువారం విచారణ అనంతరం వాళ్లిద్దరూ వచ్చే నెలలో తమ ఎదుట హాజరు కావాలని కోర్టు తెలిపింది.

ముంబయి మాఫియా క్వీన్‌ గంగూబాయ్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకుని సంజయ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘గంగూబాయ్ కతియావాడి’. ఆలియా భట్‌ టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నారు. ప్రముఖ రచయిత హుస్సేన్‌ జైదీ రచించిన ‘మాఫియా క్వీన్స్ ఆఫ్‌ ముంబయి’ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ ఆకట్టుకొంది. అయితే, ఈ సినిమాలో గంగూబాయ్‌ని కించపరిచేలా చూపించారని పేర్కొంటూ ఇటీవల ఆమె దత్త పుత్రుడు రాజీవ్‌ షా కోర్టును ఆశ్రయించాడు.. ఈ సినిమాలోని సన్నివేశాలు తన తల్లిని నెగటివ్‌గా చూపించేలా ఉన్నాయని.. సమాజంలో ఆమె గౌరవానికి భంగం వాటిల్లే అవకాశముందని రాజీవ్‌ షా కోర్టుకు తెలియజేశాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని