అదరగొట్టిన అంబటి రాయుడు - mumbai indians target 219
close
Updated : 01/05/2021 22:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అదరగొట్టిన అంబటి రాయుడు

ఇంటర్నెట్ డెస్క్‌: ముంబయి ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో  చెన్నై సూపర్‌ కింగ్స్ బ్యాట్స్‌మెన్‌ అదరగొట్టారు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ధోనీ సేన..నిర్ణీత ఓవర్లలో 218  పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్(4)ని తొలి ఓవర్‌లోనే ట్రెంట్ బౌల్ట్‌ వెనక్కి పంపాడు. మరో ఓపెనర్‌ డుప్లెసిస్‌ (50; 28 బంతుల్లో 2×4, 4×6), మొయిన్‌ అలీ (58; 36 బంతుల్లో  5×4, 5×6) రాణించారు. ధాటిగా ఆడుతున్న అలీ బుమ్రా బౌలింగ్‌లో పొలార్డ్‌కు క్యాచి ఇచ్చి వెనుదిరిగాడు. తర్వాత ఓవర్లోనే డుప్లెసిస్‌, సురేశ్‌ రైనా(2)లను పొలార్డ్‌ వరుస బంతుల్లో ఔట్ చేశాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన అంబటి రాయుడు (72; 27 బంతుల్లో 4×4; 7×6) సిక్సర్లతో విరుచుపడ్డాడు. జడేజా 22 పరుగులు చేశాడు. దీంతో చెన్నై భారీ స్కోరును సాధించింది. పొలార్డ్‌ 2, బౌల్ట్‌, బుమ్రా చెరో వికెట్ తీశారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని