ముంబయి మురిసే..  - mumbai indians won the match against rajasthan royals
close
Published : 29/04/2021 20:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ముంబయి మురిసే.. 

రాజస్థాన్‌పై ఘన విజయం..

ఇంటర్నెట్‌డెస్క్‌: రాజస్థాన్‌ రాయల్స్‌ నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని ముంబయి ఇండియన్స్ 18.3 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌(70 నాటౌట్‌; 50 బంతుల్లో 6x4, 2x6), కృనాల్‌ పాండ్య(39; 26 బంతుల్లో 2x4, 2x6) దంచికొట్టారు. అంతకుముందు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ(14), సూర్యకుమార్‌ యాదవ్‌(16) విఫలమయ్యారు. చివర్లో కీరన్‌ పొలార్డ్‌(16; 8బంతుల్లో 2x4, 1x6) ధాటిగా ఆడి 9 బంతులు మిగిలి ఉండగానే ముంబయికి విజయాన్ని అందించాడు. దీంతో రోహిత్‌సేన ఈ సీజన్‌లో మూడో విజయాన్ని సొంతం చేసుకుంది. రాజస్థాన్‌ బౌలర్లలో క్రిస్‌మోరిస్‌ రెండు వికెట్లు తీయగా ముస్తాఫిజర్‌ ఒక వికెట్ పడగొట్టాడు.

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ రాయల్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 171 పరుగుల స్కోర్‌ సాధించింది. ఓపెనర్లు జోస్‌ బట్లర్‌(41; 32 బంతుల్లో 3x4, 3x6), యశస్వి జైశ్వాల్‌(32; 20 బంతుల్లో 2x4, 2x6) శుభారంభం చేశారు. ఇద్దరూ తొలి వికెట్‌కు 66 పరుగులు జోడించారు. అయితే ప్రమాదకరంగా మారుతున్న వీరిద్దరినీ రాహుల్‌ చాహర్‌ వరుస ఓవర్లలో పెవిలియన్‌ పంపాడు. 8వ ఓవర్‌లో బట్లర్‌ను స్టంపౌట్‌ చేసిన ముంబయి స్పిన్నర్‌ తన తర్వాతి ఓవర్‌లో యశస్విని క్యాచ్‌ అండ్‌ బౌల్డ్‌ చేశాడు. అప్పటికి రాజస్థాన్‌ పది ఓవర్లకు 91/2తో మెరుగైన స్థితిలోనే ఉంది. ఆపై కెప్టెన్‌ సంజూ శాంసన్‌(42; 27 బంతుల్లో 5x4), శివమ్‌దూబె(35; 31 బంతుల్లో 2x4, 2x6) రాణించినా చివర్లో ధాటిగా ఆడే క్రమంలో ఔటయ్యారు. బౌల్ట్‌ సంజూను బౌల్డ్‌ చేయగా దూబెను బుమ్రా బుట్టలో వేసుకున్నాడు. చివరికి డేవిడ్‌ మిల్లర్‌(7), రియాన్‌ పరాగ్‌(8) పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని