మౌత్‌ వాష్‌ ఆర్డర్‌ చేస్తే.. ఫోన్‌ వచ్చింది - mumbai man orders mouthwash on amazon gets smartphone
close
Published : 18/05/2021 13:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మౌత్‌ వాష్‌ ఆర్డర్‌ చేస్తే.. ఫోన్‌ వచ్చింది

ముంబయి: కొన్ని సార్లు ఆన్‌లైన్‌లో ఏవైనా వస్తువులు ఆర్డర్‌ చేసినపుడు అవి కాకుండా వేరే వస్తువులు రావడాన్ని మనం చూశాం. అలాగే ఫోన్‌, ల్యాప్‌టాప్‌లు ఆర్డర్‌ చేసినపుడు వాటి స్థానంలో రాళ్లు, సబ్బులు వచ్చిన ఉదంతాలు కూడా ఉన్నాయి. అలాంటి సందర్భాల్లో వినియోగదారులు సదరు సంస్థను లేదా పోలీసులను ఆశ్రయిస్తారు. తాజాగా ముంబయిలో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. కానీ ఇక్కడ వినియోగదారుడు నష్టపోవడం కాదు ప్యాకెట్‌లో వచ్చిన వస్తువును చూసి ఆశ్చర్యపోయాడు. అసలేం జరిగిందంటే..

ముంబయికి చెందిన లోకేశ్‌ అనే వ్యక్తి మే 10న మౌత్‌వాష్‌ల కోసం ఈ కామర్స్‌ సైట్‌ అమెజాన్‌లో ఆర్డర్‌ పెట్టారు. ఆర్డర్‌ వచ్చిన తర్వాత చూస్తే దానిలో ‘రెడ్‌ మీ నోట్‌ 10’ ఉంది. దీంతో ఆశ్చర్యపోయిన లోకేశ్‌ ప్యాకెట్‌పై వివరాలను చూస్తే తన పేరు ఉంది.. కానీ ఇన్‌వాయిస్‌ వేరే వ్యక్తిది ఉన్నట్లు గుర్తించాడు. దీంతో ఆ ఆర్డర్‌ను రిటర్న్‌ చేసేందుకు ప్రయత్నించాడు. అమెజాన్‌ నిబంధనల ప్రకారం మౌత్‌వాష్‌ వంటి ఉత్పత్తులను రిటర్న్‌ చేయడం కుదరలేదు. దీంతో లోకేశ్‌ అమెజాన్‌ ఇండియా ట్విట్టర్‌ ఖాతాను ట్యాగ్‌ చేస్తూ తనకు ఎదురైన ఇబ్బందిని వివరించాడు. ఆ స్మార్ట్‌ ఫోన్‌ అసలు ఓనర్‌కు పంపేలా చూడాలని కోరుతూ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌ వైరల్‌ కావడంతో దీనిపై నెటిజన్లు సరదాగా స్పందిస్తున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని