మెగా కాంపౌండ్‌లో మ్యూజికల్‌ నైట్‌ - musical night at mega compond
close
Published : 16/01/2021 00:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

మెగా కాంపౌండ్‌లో మ్యూజికల్‌ నైట్‌

సందడి చేసిన నాగార్జున

వైరల్‌గా మారిన ఫొటోలు

హైదరాబాద్‌: మెగాస్టార్‌ చిరంజీవి నివాసంలో సంక్రాంతి వేడుకలు గత రెండు రోజులుగా సందడిగా జరుగుతున్నాయి. బుధవారం ఉదయం ఇంటి ఆవరణలో భోగి మంటలతో ఈ వేడుకలను ప్రారంభించిన మెగా ఫ్యామిలీ.. దానికి సంబంధించిన ఫొటోలను సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ఈ వేడుకల్లో చిరంజీవి, నాగబాబు కుటుంబాలతోపాటు ఉపాసన-చెర్రీ, బన్నీ ఫ్యామిలీ, సాయిధరమ్‌తేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌, సుస్మితా దంపతులు, శ్రీజ దంపతులు పాల్గొన్నారు. కొత్తగా వివాహబంధంలోకి అడుగుపెట్టిన నిహారిక-చైతన్య వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

కాగా, తాజాగా సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం రాత్రి మెగా కాంపౌండ్‌లో మ్యూజికల్‌ నైట్‌ నిర్వహించారు. ఎంతో సందడిగా జరిగిన ఈ కార్యక్రమంలో అక్కినేని నాగార్జున సందడి చేశారు. కార్యక్రమం అనంతరం మెగా హీరోలతో నాగార్జున కలిసి దిగిన ఓ ఫొటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇదిలా ఉండగా మ్యూజికల్‌ నైట్‌లో భాగంగా చిరంజీవి చిన్నల్లుడు, నటుడు కల్యాణ్‌దేవ్‌ ‘యమహానగరి’ పాట పాడి అందర్నీ అలరించారు.

ఇదీ చదవండి

సలార్‌ షురూ


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని