muskan sethi: మరోప్రస్థానం నాకు ఛాలెంజింగ్‌ మూవీ! - muskan sethi about maro prasthanam movie
close
Published : 14/09/2021 13:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

muskan sethi: మరోప్రస్థానం నాకు ఛాలెంజింగ్‌ మూవీ!

హైదరాబాద్‌: ‘పైసా వసూల్’, ‘రాగల 24 గంటల్లో’ చిత్రాల్లో నటించి తన అందంతో, అభినయంతో ఆకట్టుకున్న అందాల కథానాయిక ముస్కాన్ సేథి. ఇప్పుడు మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. తనీష్‌ కథానాయకుడిగా జానీ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘మరో ప్రస్థానం’. వరుడు ఫేమ్ భానుశ్రీ మెహ్రా, కబీర్ దుహాన్ సింగ్, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషించారు. హిమాలయ స్టూడియో మాన్షన్స్, ఉదయ్ కిరణ్ సమర్పణలో మిర్త్ మీడియా సంస్థ నిర్మించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబరు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా ముస్కాన్ సేథి మాట్లాడుతూ.. ‘‘మరో ప్రస్థానం’ నాకు ప్రత్యేకమైన చిత్రం. ఇది ఒక ఎమోషనల్‌ మూవీ. ఇందులో నేను యాక్షన్ సీన్స్‌ కూడా చేశా. ఇటువంటి క్యారెక్టర్ చేయడం చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది. దర్శకుడు జానీ అన్నీ అర్థమయ్యేలా చక్కగా వివరించడం వల్లే ఈ క్యారెక్టర్‌ను చేయగలిగాను. ఈ కథ అంతా ఒక రోజులోనే జరుగుతుంది. ప్రతి సన్నివేశం వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. ఫైట్ మాస్టర్ శివ నేతృత్యంలో షూట్ చేసిన యాక్షన్ సీన్స్ చాలా బాగా వచ్చాయి. అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ చిత్రం నచ్చుతుంది’’ అని చెప్పుకొచ్చింది.



మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని