సమంతకు ఫిదా అయిన రకుల్‌ ఫ్యామిలీ - my family members became samantha fans says rakul preet singhs
close
Published : 08/06/2021 15:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సమంతకు ఫిదా అయిన రకుల్‌ ఫ్యామిలీ

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇప్పుడు ఎవర్ని కదిలించినా ‘ది ఫ్యామిలీ మ్యాన్2‌’ మాటే వినిపిస్తోంది. సమంతపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆమె తొలిసారిగా నటించిన వెబ్‌సిరీస్‌ ‘ఫ్యామిలీ మ్యాన్2‌’ ఇటీవల విడుదలైంది. ఈ సిరీస్‌కు విశేషమైన ప్రేక్షకాదరణ లభిస్తోంది. ఇందులో సమంత ‘రాజీ’ అనే తిరుగుబాటుదారుగా కనిపించింది. నిడివి తక్కువే అయినా.. సమంత ఆ పాత్రకు పూర్తి న్యాయం చేసింది. నిజానికి ఒక స్టార్‌ హోదాలో ఉన్న హీరోయిన్‌ ఇలాంటి డీగ్లామర్‌ పాత్ర చేయడం సాహసమనే చెప్పాలి. సవాల్‌తో కూడుకున్న పాత్రలు చేసేందుకు ఎక్కువగా ఇష్టపడే సమంత ఈ పాత్రను పోషించి అందరితో శెభాష్‌ అనిపించుకుంటోంది. ఆమె నటనకు ఎంతోమంది ముగ్దులైపోయారు. ఆమె సహనటి రకుల్‌ప్రీత్‌సింగ్‌ కూడా సమంతకు ఫిదా అయిపోయింది. అంతేకాదు.. రకుల్‌ ఫ్యామిలీ మొత్తం సమంతకు అభిమానులుగా మారిపోయారట. ఈ విషయాన్ని రకుల్‌ ట్విటర్‌లో చెప్పుకొచ్చింది.

‘‘ఫ్యామిలీ మ్యాన్2‌’ చూశాను. చాలా బాగుంది. ప్రతిఒక్కరూ చాలా అద్భుతంగా నటించారు. మనోజ్‌బాజ్‌పాయ్‌ని పొగడాలంటే మాటలు సరిపోవడం లేదు. ఇక సమంత.. నీకు హ్యాట్సాఫ్‌. ‘రాజీ’ పాత్రను చాలా చక్కగా చూపించావు. మా కుటుంబంలో నాతో పాటు అందరూ నీ అభిమానులుగా మారిపోయారు. దర్శకద్వయం రాజ్‌ అండ్‌ డీకేకు ప్రత్యేక అభినందనలు’ అని రకుల్‌ ట్విటర్‌లో పేర్కొంది.

రాజ్‌ అండ్‌ డీకే ఈ ‘ఫ్యామిలీ మ్యాన్‌2’ను తెరకెక్కించారు. మనోజ్‌ బాజ్‌పాయ్‌, ప్రియమణి, సమంత, షరీబ్‌ హష్మి, సాజిద్‌, మేజర్‌ సమీర్‌, దేవ దర్శిని, ఆనందసామి తదితరులు కీలక పాత్రలు పోషించారు. రాజ్‌ అండ్‌ డీకే, సుమన్‌ కుమార్‌ కథ అందించగా.. సచిన్‌ జిగార్‌, కేతన్‌ సోదా సంగీతం సమకూర్చారు. డీ2ఆర్‌ ఫిల్మ్స్‌ పతాకంపై రాజ్‌ నిడుమోరు, కృష్ణ డీకే నిర్మించారు. అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని