నా పర్సనల్‌ లైఫ్‌పై ఫోకస్‌ చేయొద్దు: శ్రుతిహాసన్‌ - my focus is my work and that is what i would like others to focus on as well says shruthi hassan
close
Published : 03/02/2021 14:10 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నా పర్సనల్‌ లైఫ్‌పై ఫోకస్‌ చేయొద్దు: శ్రుతిహాసన్‌

హైదరాబాద్‌: ఇండస్ట్రీలో ఉన్న  ప్రతిఒక్కరికీ వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలుంటాయని నటి శ్రుతిహాసన్‌ తెలిపారు. ప్రస్తుతం తాను వృత్తిపరమైన జీవితంపై ఎక్కువగా ఫోకస్‌ చేస్తున్నానని కాబట్టి అందరూ కూడా దాని గురించే మాట్లాడితే బాగుంటుందని ఆమె అన్నారు. దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ఆమె ‘క్రాక్‌’తో తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఆమె చేతిలో ‘వకీల్‌సాబ్‌’, ‘సలార్‌’, ‘పిట్టకథలు’ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి.

‘సలార్‌’ షూట్‌లో పాల్గొన్న శ్రుతిహాసన్‌ తాజాగా ఓ ఆంగ్ల మీడియాతో ముచ్చటించారు. ‘ప్రస్తుతం ‘సలార్‌’ షూట్‌లో బిజీగా పాల్గొంటున్నాను. ఇప్పటి వరకూ నేను పోషించిన పాత్రలతో పోలిస్తే.. ఈ సినిమాలో నా క్యారెక్టర్‌ చాలా విభిన్నంగా ఉండనుంది. ‘సలార్‌’ గురించి ఇప్పుడే పెదవి విప్పలేను. మొదటిసారి ప్రభాస్‌తో కలిసి పనిచేయడం నాకెంతో ఆనందంగా ఉంది. మంచి మనస్సున్న, వృత్తిపట్ల పూర్తి నిబద్ధత కలిగిన వ్యక్తి ఆయన’ అని శ్రుతి‌ తెలిపారు.

గత కొన్నిరోజుల నుంచి ప్రముఖ డూడుల్‌ ఆర్టిస్ట్‌ శాంతను హజారికాతో శ్రుతి ప్రేమలో ఉందంటూ వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. సదరు వార్తలపై ఆమె స్పందిస్తూ.. ‘వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడం నాకిష్టం లేదు. ప్రస్తుతం నా ఫోకస్‌ మొత్తం పనిమీదనే. కాబట్టి ఎదుటివారు కూడా నా వర్క్‌పైనే ఫోకస్‌ చేస్తే బాగుంటుంది’ అని ఆమె వివరించారు.

ఇదీ చదవండి

జ్వరంతో ఉన్నా.. చిరు నా కోసం ఎదురుచూశారుమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని