close
Published : 17/01/2021 09:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నేను తెలుగింటి అల్లుడినే: సోనూసూద్‌

నా మొదటి ప్రాధాన్యం తెలుగుకే

హైదరాబాద్‌: తన భార్య సోనాలి సూద్‌ తెలుగింటి ఆడపడుచని.. తాను తెలుగు కుటుంబంలో ఓ సభ్యుడినేనని బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ అన్నారు. బెల్లంకొండ శ్రీనివాస్‌ కథానాయకుడిగా నటించిన ‘అల్లుడు అదుర్స్‌’ చిత్రంలో ‘గజ’గా మెప్పించిన సోనూసూద్‌.. తాజాగా ఆ సినిమా సక్సెస్‌మీట్‌లో పాల్గొన్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఈవెంట్‌లో దర్శక నిర్మాతలతోపాటు చిత్రబృందంలోని పలువురు సభ్యులు, నటీనటులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సోనూ మాట్లాడుతూ.. తెలుగు పరిశ్రమ పట్ల తనకున్న అభిమానాన్ని తెలియజేశారు.

‘అందరికీ నమస్కారం.. తెలుగువారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఏ చిత్రపరిశ్రమైనా (బాలీవుడ్‌, కోలీవుడ్..‌) నేను ఎప్పుడూ ఒక్కటే చెబుతుంటాను. తెలుగు పరిశ్రమంటే నాకెంతో ఇష్టమని. అలాగే నా మొదటి ప్రాధాన్యం తెలుగు పరిశ్రమకేనని. సినిమాకు సంబంధించిన ఎన్నో విషయాలు తెలుగు పరిశ్రమ నుంచే నేర్చుకున్నాను. నా భార్య తెలుగు ప్రాంతానికి చెందిన మహిళ. కాబట్టి నేను మీ కుటుంబంలో ఒకడిని. బెల్లంకొండ సురేష్‌‌.. మీరంటే నాకెంతో అభిమానం. ఏదైనా సినిమాలో పాత్ర ఉందని కేవలం ఫోన్‌ చేస్తే చాలు నేను వచ్చేస్తాను. పాత్ర, స్క్రిప్ట్‌ గురించి నాకు చెప్పాల్సిన అవసరమే లేదు. ‘అల్లుడు అదుర్స్‌’లో నాకో మంచి పాత్ర ఇచ్చినందుకు థ్యాంక్యూ సో మచ్‌. అలాగే, నా బ్రదర్‌ శ్రీనివాస్‌.. మంచి మనసున్న మనిషి. టాలెంట్‌, కష్టపడేతత్వం కలిగిన వ్యక్తి. శ్రీనివాస్‌ బాలీవుడ్‌లో సైతం మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఆశిస్తున్నాను’ అని సోనూసూద్‌ తెలిపారు.

ఇదీ చదవండి

ఇండస్ట్రీలో నాకు పోటీ ఎవరో ఇన్నాళ్లకు తెలిసిందిTags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని