CoviSelf: జూన్‌ 1 నాటికి కోటి కిట్లు - mylab to make one cr covid home test kits before national rollout on june 1
close
Updated : 21/05/2021 17:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

CoviSelf: జూన్‌ 1 నాటికి కోటి కిట్లు

వెల్లడించిన మైల్యాబ్‌ సంస్థ

ముంబయి: ఇంట్లోనే కరోనా టెస్టు నిర్వహించుకొనేలా పుణెకు చెందిన మైల్యాబ్‌ సంస్థ కోవిసెల్ఫ్‌ కిట్లను తయారు చేసిన విషయం తెలిసిందే. ఐసీఎంఆర్‌ అనుమతించిన ఈ టెస్టు కిట్ల ధరను రూ. 250గా నిర్ణయించారు. ఈ నేపథ్యంలో జూన్‌ 1  నాటికి కోటి కిట్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు మైల్యాబ్‌ సంస్థ డైరక్టర్‌ శ్రీకాంత్‌ పటోలే వెల్లడించారు. ‘‘ప్రస్తుతం మేం లొనావాలాలో రోజుకు 10 లక్షల యూనిట్ల కిట్లను తయారు చేస్తున్నాం. రానున్న పదిరోజుల్లోగా కోటి కిట్లను అందుబాటులోకి తీసుకురావాలన్నదే మా లక్ష్యం. జూన్‌ 1 నుంచి ఈ కిట్లు అందుబాటులోకి రానున్నాయి. కిట్లను విడుదల చేసిన తర్వాత కొరత రాకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. రానున్న రోజుల్లో కిట్ల ఉత్పత్తిని మరింత పెంచుతాం’’ అని శ్రీకాంత్‌ తెలిపారు.

ఈ కిట్ల ఆధారంగా పరీక్షించుకున్న వారు వేరే టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం లేదని ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల్లో సూచించింది. కరోనా లక్షణాలున్నవారు మాత్రమే ఈ కిట్‌ను వినియోగించాలని తెలిపింది. కరోనా పాజిటివ్‌ వచ్చిన వారు వెంటనే తగు జాగ్రత్తలు తీసుకుంటూ, హోం క్వారంటైన్‌లో ఉండేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు.

కొవిసెల్ఫ్‌ ఎలా వాడాలంటే...




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని