కోహ్లీకి సంతోషాన్నిచ్చింది ఇదే - myself comeback in chennai is more happy says kohli
close
Published : 07/03/2021 01:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కోహ్లీకి సంతోషాన్నిచ్చింది ఇదే

అహ్మదాబాద్‌: చెన్నైలో జరిగిన రెండో టెస్టులో పుంజుకోవడమే తనకు ఎక్కువ సంతోషాన్ని ఇచ్చిందని టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ అన్నాడు. తొలి మ్యాచులో ఇంగ్లాండ్‌ తమను చిత్తుగా ఓడించిందని గుర్తు చేసుకున్నాడు. యువకులు తమకు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నారని పేర్కొన్నాడు. రవిచంద్రన్‌ అశ్విన్‌ తమ జట్టుకు అత్యంత విలువైన ఆటగాడని స్పష్టం చేశాడు. 3-1 తేడాతో ఇంగ్లాండ్‌పై సిరీస్‌ కైవసం చేసుకున్న తర్వాత అతడు మీడియాతో మాట్లాడాడు.

‘తొలి టెస్టులో టాస్‌ కీలకంగా మారింది. బౌలర్లకు అస్సలు కలిసిరాలేదు. అందుకే రెండో టెస్టులో పుంజుకోవడం ఆనందంగా అనిపించింది. మా రిజర్వు బెంచ్‌ అత్యంత పటిష్ఠంగా ఉంది. ఇది భారత క్రికెట్‌కు శుభసూచకం. ప్రమాణాలు ఏమాత్రం తగ్గలేదు. మ్యాచులో కీలకమైన సమయంలో రిషభ్‌, సుందర్‌ తమ భాగస్వామ్యంతో దీనిని రుజువు చేశారు. తొలిటెస్టు తర్వాత మా దేహభాషను మరింత మెరుగుపర్చుకున్నాం’ అని కోహ్లీ వివరించాడు.

‘అంతర్జాతీయ క్రికెట్లో ప్రతి జట్టు నాణ్యమైందే. సొంతగడ్డపై అయినా సరే వారిని ఓడించేందుకు శ్రమించాల్సిందే. ఆ తీవ్రతను కొనసాగించడమే చాలా ముఖ్యం. మా జట్టు లక్ష్యమూ అదే. చెన్నైలో రోహిత్‌ కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. కొన్నేళ్లుగా అశ్విన్‌ మాకు ముఖ్య ఆటగాడిగా ఉన్నాడు. వీరిద్దరూ ఈ టెస్టు సిరీసులో రాణించారు. ఇప్పుడు మేం ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ సవాల్‌ను స్వీకరిస్తున్నాం. 2020లో మేం కివీస్‌ చేతిలో దారుణంగా ఓడాం. కానీ ఇప్పుడు మేం మెరుగ్గా ఉన్నాం’ అని కోహ్లీ తెలిపాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని