తెలుగు హీరోలపై నభానటేష్‌ కామెంట్‌! - nabha natesh on telugu heros and fans and many more
close
Updated : 19/03/2021 12:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తెలుగు హీరోలపై నభానటేష్‌ కామెంట్‌!

ట్విటర్‌లో నటి ఏమన్నారంటే

హైదరాబాద్‌: ‘నన్ను దోచుకుందువటే’తో కుర్రకారు హృదయాలు దోచుకున్న ఇస్మార్ట్‌ బ్యూటీ నభానటేశ్‌. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహించిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’తో తెలుగులో మొదటి విజయాన్ని అందుకున్న నభా.. అనంతరం ‘డిస్కో రాజా’, ‘సోలో బ్రతుకే సో బెటర్‌’, ‘అల్లుడు అదుర్స్‌’ చిత్రాల్లో నటించారు. అయితే, ఈ చిత్రాలేవీ ఆమెకు అనుకున్నంత స్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టలేకపోయాయి. ప్రస్తుతం ‘అంధాధున్‌’ రీమేక్‌ కోసం శ్రమిస్తున్న నభానటేశ్‌ తాజాగా తెలుగు అభిమానులు, కొంతమంది టాలీవుడ్‌ హీరోల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ విశేషాలు మీకోసం..

మీరు నైట్‌ పర్సనా‌ లేదా మార్నింగ్‌ పర్సనా‌?

నైట్‌

ఏ జానర్‌ చిత్రాలంటే మీకు ఎక్కువ ఇష్టం?

యాక్షన్‌ థ్రిల్లర్లు చూడటమంటే ఇష్టం

హాలిడేకి వెళ్లాలనుకునే ప్రదేశం?

గోవా

రామ్‌ గురించి ఒక్క మాటలో.. ?

ఎనర్జీ బ్లాస్ట్‌

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌పై మీ అభిప్రాయం?

ఆయన అభిమానుల సునామీ

ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న మీ తదుపరి చిత్రమేది?

నితిన్‌ 30 (అంధాధున్‌ రీమేక్‌). ఆ సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నా. ఈ ఏడాది జూన్‌ 11న విడుదల కానుంది. అందరూ తప్పకుండా వీక్షించండి.

బెల్లంకొండ శ్రీనివాస్‌తో స్క్రీన్‌ పంచుకోవడం ఎలా ఉంది?

చాలా బాగుంది.

థియేటర్‌లో మీరు చూసిన చివరి చిత్రమేది?

టామ్‌ అండ్‌ జెర్రీ

తెలుగు అభిమానులపై మీ అభిప్రాయం?

ఎంతో ఉత్తమమైన వాళ్లు. వారిపై నాకు అపరిమితమైన ప్రేమాభిమానాలున్నాయి.

మీ సెలబ్రిటీ క్రష్‌ ఎవరు?

ఫ్రెంచ్‌ నటుడు బ్రావో

రవితేజ గురించి.. ?

మాస్‌ కా బాప్‌, అలాగే మంచి మనస్సున్న గొప్ప వ్యక్తి

హైదరాబాద్‌ ఫుడ్‌లో మీరు ఇష్టపడేది..?

బిర్యానీ, హలీమ్‌.. 

నభా తెలుగులో మాట్లాడు!

ఏం చెప్పాలి.. చెప్పండి

మీరు చూసిన తొలి తెలుగు చిత్రమేది?

ఆర్య

తెలుగులో మీరు డబ్బింగ్‌ ఎప్పుడు చెబుతారు?

త్వరలోనే..!
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని