అవార్డు విన్నింగ్‌ డైరెక్టర్‌ నుంచి ఇంట్రెస్టింగ్‌ మూవీ - nabhamsi teaser from award winning director ram alladi
close
Published : 07/03/2021 18:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అవార్డు విన్నింగ్‌ డైరెక్టర్‌ నుంచి ఇంట్రెస్టింగ్‌ మూవీ

ఆసక్తిరేపుతున్న ‘నభాంసీ’ టీజర్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: వినూత్నమైన సినిమాలతో ఎన్నో అంతర్జాతీయ పురస్కారాలు సొంతం చేసుకున్న డైరెక్టర్‌ రామ్‌ అల్లాడి. ఈసారి సంస్కృతంలో సినిమా తీసేందుకు సిద్ధమయ్యారు. వెయ్యేళ్ల క్రితం నాటి కథ ఆధారంగా ‘నభాంసీ’ పేరుతో ఈ సినిమా తెరకెక్కనుంది. తన చిన్ననాటి జ్ఞాపకాలను ఛేదిస్తూ ఉండే ఓ వ్యక్తి.. మరోవైపు తన భార్యతో శృంగార జీవితం.. ఇతివృత్తంగా ఈ సినిమాను రూపొందించనున్నారు. చిత్ర టీజర్‌ తాజాగా విడుదలైంది. ‘ఈ విశ్వంలో మానవుడి పోరాటం ఒంటరి కాదు’ అని చెబుతూ సాగే ఆ టీజర్‌ ఎంతో ఆసక్తికరంగా ఉంది.

న్యూయార్క్‌లో స్థిరపడ్డ రామ్‌ అల్లాడి అంతర్జాతీయ స్థాయి డైరెక్టర్‌గా గుర్తింపు పొందారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన వచ్చిన తొలి డాక్యుమెంటరీ ‘చేసిల్డ్‌’కిఏకంగా 11 అంతర్జాతీయ పురస్కారాలు వచ్చాయి. ఆ తర్వాత మహాత్మా గాంధీ జీవితంలోని కొన్ని సంఘటనల ఆధారంగా ‘మెటనోయా’ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. దానికి కూడా 14 అంతర్జాతీయ పురస్కారాలు వచ్చాయి. ఇప్పుడు మరింత కొత్తగా ఆలోచించి సంస్కృతంలో సినిమా తీయబోతున్నారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చిత్రీకరణ ప్రారంభంకానుందని ట్విటర్‌ వేదికగా దర్శకుడు రామ్‌ వెల్లడించారు. చిత్రీకరణ అమెరికాలోనే చేయనున్ననట్లు తెలుస్తోంది. 2022లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని