అమలతో నటించిన చిత్రాలెన్నో చెప్పలేకపోయిన నాగ్‌! - nag about his films
close
Published : 01/04/2021 18:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అమలతో నటించిన చిత్రాలెన్నో చెప్పలేకపోయిన నాగ్‌!

ఇంటర్నెట్‌ డెస్క్: తన సతీమణి అమలతో కలిసి చేసిన సినిమాలెన్నో చెప్పలేకపోయి, నవ్వులు పంచుతున్నారు అక్కినేని నాగార్జున. ఆయన నటించిన తాజా చిత్రం ‘వైల్డ్‌ డాగ్‌’ ఈ నెల 2న ప్రేక్షకుల ముందుకురాబోతుంది. ఈ నేపథ్యంలో రానా వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘No. 1 యారి’ కార్యక్రమానికి నాయిక సయామీ ఖేర్‌తో కలిసి విచ్చేశారాయన. ఆ షోలో రానా అడిగిన ప్రశ్నలకు సమాధానం తెలియక నాగ్‌ ఇచ్చే హావభావాలు నవ్వులు పూయిస్తున్నాయి.

‘సయామీ నటించిన తొలి తెలుగు సినిమా? మీరు (నాగ్‌) బాల నటుడిగా నటించిన చిత్రాలెన్ని? నాగార్జున గారు, అమలగారు చేసిన సినిమాలెన్ని?’ అని రానా అడగ్గా జవాబులు ఇవ్వలేకపోయిన నాగ్‌ని చూస్తే మీరు నవ్వేస్తారు! ప్రస్తుతం నెట్టింట ఈ ప్రోమో సందడి చేస్తోంది. ఆయనకు సమాధానాలు తెలిసి చెప్పలేదా? తర్వాత ఏమైనా చెప్పారా? తెలియాలంటే పూర్తి ఎపిసోడ్‌ చూడాల్సిందే. ఈలోగా ఈ ప్రోమో చూసేయండి.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని