Prabhas: ప్రభాస్‌ చేసే ఆ రెండు సినిమాలేంటి? - nag ashwin to direct prabhas25
close
Published : 04/07/2021 01:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Prabhas: ప్రభాస్‌ చేసే ఆ రెండు సినిమాలేంటి?

ఇంటర్నెట్‌డెస్క్‌: వరుసగా పాన్‌ ఇండియా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు అగ్ర కథానాయకుడు ప్రభాస్‌. రాధాకృష్ణకుమార్‌ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న ‘రాధేశ్యామ్‌’ చిత్రీకరణ చివరి దశకు వచ్చేసింది. దీని తర్వాత ఓం రౌత్‌ తెరకెక్కిస్తున్న మైథలాజికల్‌ మూవీ ‘ఆది పురుష్‌’ షూటింగ్‌లో పాల్గొంటారు. మరోవైపు ప్రశాంత్‌నీల్‌ తీస్తున్న ‘సలార్‌’ ఒక షెడ్యూల్‌ పూర్తి చేసుకుంది. ఈ సినిమాల తర్వాత నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్‌ చిత్రంలో ప్రభాస్‌ నటించనున్న సంగతి తెలిసిందే. కాగా, ఇప్పుడు ఈ చిత్రం ‘ప్రభాస్‌ 25’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో ట్రెండింగ్‌లో ఉంది.

‘రాధేశ్యామ్‌’ చిత్రీకరణలో ఉండగానే ప్రభాస్‌ 21వ చిత్రంగా నాగ్‌ అశ్విన్‌ మూవీని ప్రకటించారు. అయితే, మధ్యలో ‘ఆది పురుష్‌’, ‘సలార్‌’ వచ్చాయి. దీంతో నాగ్‌ అశ్విన్‌ చిత్రం ప్రభాస్‌ తన 23వ మూవీ అయింది. ఈ నేపథ్యంలో నాగీ చిత్రానికి పనిచేస్తున్న సినిమాటోగ్రాఫర్‌ డానీ సాలో ఇన్‌స్టాలో ‘ప్రభాస్‌ 25వ మూవీ ఓ మైలురాయి’ అని అర్థం వచ్చేలా పోస్ట్‌ చేశాడు. ఆ పోస్ట్‌ కాస్తా వైరల్‌గా మారింది. నాగీ చిత్రం ప్రభాస్‌ 25వ మూవీ అయితే, మరి 23, 24 చిత్రాలు ఎవరితో అన్న ఆసక్తి మొదలైంది. ‘సలార్‌’ తర్వాత ప్రభాస్‌ బాలీవుడ్‌ దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌తో ఓ మూవీ, ప్రశాంత్‌నీల్‌తో మరో మూవీ చేయనున్నారని టాక్‌ వినిపిస్తోంది. ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే, సిద్ధార్థ్ మూవీ ‘ధూమ్‌’ సిరీస్‌లో భాగంగా తెరకెక్కనుందట. ఇవన్నీ పూర్తయిన తర్వాతే ప్రభాస్‌-నాగీ పాన్‌ వరల్డ్‌ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం. ఇప్పటికే కొవిడ్‌ దెబ్బకు సినిమా షెడ్యూల్స్‌ అన్నీ కకావికలం అయ్యాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఏ మూవీ ముందు విడుదలవుతుంది? ఏది తర్వాత వస్తుంది? అన్నది చాలా మంది కథానాయకుల ముందున్న అతి పెద్ద ప్రశ్న.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని