నిహారిక-చైలకు కొవిడ్‌ టెస్ట్‌: నాగబాబు అప్‌డేట్‌ - naga babu speak about niharika and chaitanya covid test
close
Updated : 01/01/2021 04:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నిహారిక-చైలకు కొవిడ్‌ టెస్ట్‌: నాగబాబు అప్‌డేట్‌

హైదరాబాద్‌: మెగా హీరోలు రామ్‌చరణ్‌, వరుణ్‌తేజ్‌లకు కరోనా పాజిటివ్‌ అని తేలడంతో ప్రస్తుతం వాళ్లిద్దరూ హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో అటు అభిమానులు ఇటు నెటిజన్లు అంతా ఇటీవల మెగా ఫ్యామిలీలో జరిగి క్రిస్మస్‌ వేడుకలపైనే చర్చించుకుంటున్నారు. ఈ వేడుకల్లో  ఆ కుటుంబానికి చెందిన యువ నటులంతా పాల్గొన్నారు. బుధవారం అల్లు శిరీష్‌ కొవిడ్‌ టెస్టు చేయించుకోగా, నెగెటివ్‌ వచ్చినట్లు తేలింది. ఈ నేపథ్యంలో నటుడు నాగబాబు తన కుమార్తె నిహారిక, అల్లుడు చైతన్యలకు సంబంధించి ఓ అప్‌డేట్‌ను అభిమానులతో పంచుకున్నారు.

ఇటీవలే నిహారిక-చైతన్యలు విహారయాత్ర నిమిత్తం మాల్దీవులకు వెళ్లారు. దీనిపై నాగబాబు స్పందిస్తూ.. ‘నిహారిక-చైతన్యలు మాల్దీవులకు వెళ్లే ముందు కొవిడ్‌ టెస్టు చేయించుకున్నారు. అక్కడి నుంచి వచ్చిన తర్వాత వారిద్దరికీ ముంబయి ఎయిర్‌పోర్ట్‌లో మరోసారి పరీక్షలు చేశారు. రెండుసార్లు నెగెటివ్‌ వచ్చింది’ అని ట్వీట్‌ చేశారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని